
హైదరాబాద్: సోమవారం భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా క్రికెట్ దిగ్గజాలు, అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గత 20 ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తోన్న మిథాలీ రాజ్‌పై క్రికెట్ ప్రపంచమంతా ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
టీమిండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో "మిథాలీ రాజ్ నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నీకు మంచి జరగాలి...దేశానికి గర్వకారణంగా నిలుస్తూనే ఉండు" అంటూ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మిథాలీతో దిగిన ఫోటోను సచిన్ అభిమానులతో పంచుకున్నాడు.
మిథాలీ 36వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) మహిళల వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్‌కి తమ తమ ట్విట్టర్‌లో ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లడించాయి.