5500 పరుగులు: రెండో మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డు
హైదరాబాద్: ఐసీసీ మహిళల వరల్డ్ కప్ అర్హత టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. లీగ్ దశలో ఓటమెరుగని మిథాలీ నేృత్వంలోని టీమిండియా సూపర్ సిక్స్‌లోనూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన మిథాలీ 64 పరుగులు చేసింది.
మోనా మెశ్రామ్(55) కూడా అర్ధసెంచరీతో చెలరేగడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్ దీప్తిశర్మ(9) వికెట్ కోల్పోయినా.. మిథాలీ రాజ్, మెశ్రామ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
రెండో మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్
ఈ నేపథ్యంలో 5,500 పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సాధించింది. అంతకముందు ఇంగ్లాండ్ మహిళల జట్టు మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్ట్స్ 5,992 పరుగులతో మొదటి స్ధానంలో ఉంది. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఎడ్వర్ట్స్ రిటైర్మెంట్ ప్రకటించింది.
దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌట్
ఇక భారత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 46.4 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. శిఖా పాండే 4, ఏక్తా బిస్త్ 3 వికెట్లతో రాణించారు. దక్షిణాఫ్రికా జట్టులో త్రిషా శెట్టి(52) మినహా మిగతావారు కనీసం క్రీజులో కుదురుకోలేకపోయారు. త్రిషా శెట్టికి కాప్ (29) మద్దతుగా నిలవడంతో వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మిథాలీ రాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
దక్షిణాఫ్రికా బౌలర్లు కాప్, కాకాలకు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అర్ధసెంచరీతో రాణించిన మిథాలీ రాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 2014 ఐసీసీ చాంపియన్‌షిప్ సిరీస్‌తో పాటు ఈ టోర్నీకి ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సఫారీల చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్
దీంతో రెండు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా తదుపరి మ్యాచ్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఇదిలా ఉంటే మంగళవారం ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో మిథాలీరాజ్ మూడు నుంచి రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మెగ్ లాన్నింగ్(804) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications