గుడ్ న్యూస్ చెప్పిన మిథాలీ రాజ్.. అయితే కాస్త టైం తీసుకుంటుందటా..!

గత నెల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటనుకుంటున్నారా..! తాను మళ్లీ బ్యాట్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్లు హింట్ ఇచ్చింది. అయితే అది ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు కాదండోయ్.. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న వుమెన్స్ ఐపీఎల్లో ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను ఆడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ICC 100% క్రికెట్ పోడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో ఆమె స్పష్టం చేసింది.
మాజీ ఇంగ్లండ్ ప్లేయర్ ఇసా గుహా, న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్ ఫ్రాంకీ మాకేతో సంభాషిస్తూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. 2023లో ఆరంభం కానున్న WIPLలో పాల్గొనడానికి తాను ఇష్టపడతానని మిథాలీ చెప్పింది.

ఆ లోపు ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకుంటా..
మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. 'నేను ఇంకా క్రికెట్ ఆడాలనుకుంటున్నా మాట వాస్తవమే. ఇకపోతే వుమెన్స్ ఐపీఎల్ జరగడానికి మరికొన్ని నెలల టైం ఉంది కాబట్టి.. కాస్త టైం తీసుకుని ఆ లోపు ఆడాల వద్దా అనేది నిర్ణయించుకుంటా. నా మట్టుకు మాత్రం మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఆడ్డానికే మొగ్గు చూపుతా' అని ఆమె అన్నారు.

ఎంతో మనో వేధనకు గురయ్యా
ఇక మోకాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న టైంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో రిటైర్మెంట్ తీసుకోవాలని చాలాసార్లు భావించానని మిథాలీ చెప్పింది. 'నేను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని చాలా కాలం క్రితమే అనుకున్నాను. ఎందుకంటే నేను చాలా కాలంగా నా మోకాలి గాయంతో బాధపడుతూనే ఉన్నాను.
మహిళల టీం 2006-07లో బీసీసీఐ నియంత్రణలోకి వచ్చింది. కానీ నా గాయం 2005లోనే తీవ్రంగా ఉండేది. నాకు అప్పట్లో సహాయం చేయడానికి ఫిజియోలు లేరు. అలాగే వైద్య సౌకర్యాలు లేవు. అందువల్ల చాలా ఇబ్బంది పడేదాన్ని. నా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే.. నేను నా మోకాలి గాయంతోనే క్రికెట్ ఆడాను.
నేను అప్పుడు భరించిన శారీరక బాధ కంటే మానసికంగా ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నా. ఎందుకంటే నాతో పాటు మా టీంను పట్టించుకునే నాథుడే లేడని మనోవేధనకు గురయ్యా. అందుకే 2009 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించాను' అని మిథాలీ రాజ్ తెలిపింది.

షార్ట్‌గా మిథాలీ రాజ్ కెరీర్..
23ఏళ్ల కెరీర్‌లో మిథాలీ 232వన్డేల్లో 50.7 సగటుతో 7,805 పరుగులు చేసింది. ఆమె 89 టీ20ల్లో 2,364 పరుగులు చేసింది. అలాగే 12 టెస్టుల్లో 699 పరుగులు చేసింది. మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో కొన్ని అత్యుత్తమ రికార్డులు
అత్యధిక కాలం వన్డే కెరీర్ కొనసాగించిన ప్లేయర్ (పురుషులు/మహిళలు) - 22సంవత్సరాల 274రోజులు.
వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు - 7805
వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు - 232
రెండుసార్లు వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్‌కు నాయకత్వం వహించిన ఏకైక భారత కెప్టెన్ మిథాలీ రాజ్.
వుమెన్స్ టెస్ట్ క్రికెట్లో అతి చిన్న వయస్సులో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications