Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా పోరాటం కోసం.. మిథాలీ సాయం ఎంతంటే?!!

Mithali Raj and Poonam Yadav make donations to combat coronavirus pandemic

హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) పోరు కోసం తెలుగమ్మాయి, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చేతులు కలిపింది. మొత్తం రూ.10 లక్షలు విరాళం ప్రకటించింది. అందులో ప్రధాన మంత్రి నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ట్విటర్‌లో పేర్కొంది.

భారత జట్టు సీనియర్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ రూ.2 లక్షలు, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రూ.1.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌ మేరీకోమ్‌ తన నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి విరాళంగా అందజేసింది. రాజ్యసభ ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్న మేరీ.. నెల జీతం లక్ష రూపాయలను సహాయ నిధికి బదిలీ చేయాల్సిందిగా బ్యాంక్‌ అధికారులను కోరింది. కేంద్ర క్రీడా ప్రాధికార సంఘం (సాయ్‌) ఉద్యోగులు మూడు రోజుల జీతాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మొత్తం రూ.76 లక్షలు.

టీనేజ్‌ షూటర్‌ మను భాకర్‌ హర్యానా ప్రభాత్వానికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది. టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఆటగాడు జి.సాతియాన్‌ రూ. 1.25 లక్షలను విరాళంగా ప్రకటించాడు. అందులో లక్ష రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి, మిగిలిన రూ. 25 వేలను ప్రధాని సహాయ నిధికి బదిలీ చేస్తున్నట్లు తెలిపాడు. భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ రూ. 11 లక్షల విరాళం ప్రకటించాడు.

ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భూటియా తన సొంతరాష్ట్రం సిక్కింలో వలసకూలీకి స్థావరం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ కరోనాపై పోరు కోసం అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. పీఎం-కేర్స్‌ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరు రూ. 3 కోట్లు విరాళం ఇచ్చారని తెలిసింది.

Story first published: Tuesday, March 31, 2020, 8:18 [IST]
Other articles published on Mar 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+