For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారణమిదే: శ్రీలంకతో రెండో టీ20కి మిచెల్ స్టార్ దూరం!

Mitchell Starc to skip 2nd T20I vs Sri Lanka to attend brothers wedding

హైదరాబాద్: శ్రీలంకతో బుధవారం జరిగే రెండో టీ20కి ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కానున్నాడు. తన సోదరుడి వివాహం కారణంగా తాను రెండో టీ20కి అందుబాటులో ఉండటం లేదని జట్టు మేనేజ్‌మెంట్‌కి తెలిపాడు. మిచెల్ స్టార్క్ సోదరుడు బ్యాన్డాన్ కూడా అథ్లెటే కావడం విశేషం.

2018లో గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో హైజంప్ విభాగంలో బ్యాన్డాన్ స్వర్ణం సాధించాడు. మిచెల్ స్టార్క్ స్థానంలో బిల్లీ స్టాన్‌లేక్ లేదా సీన్ అబ్బాట్‌లలో ఎవరినో ఒకరిని సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. గాయపడిన ఆండ్రూ టై స్థానాన్ని సోమవారం సీన్ అబ్బాట్‌తో భర్తీ చేసిన సంగతి తెలిసిందే.

గురువారం తిరిగి ఆస్ట్రేలియా జట్టుతో

గురువారం తిరిగి ఆస్ట్రేలియా జట్టుతో

మరోవైపు వివాహం అనంతరం మిచెల్ స్టార్క్ గురువారం తిరిగి ఆస్ట్రేలియా జట్టుతో కలవనున్నాడు. రెండో టీ20కి తుది జట్టు ఎంపికపై ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ "బిల్లీ స్టాన్‌లేక్ ఇక్కడ(బ్రిస్బేన్) జట్టుతోనే ఉన్నాడు. ఇది అతడి సొంత మైదానం. అతడికే తుది జట్టులో చోటు దక్కొచ్చు. డెత్ బౌలింగ్ ఆప్షన్ గనుక ఎంచుకుంటే సీన్ అబ్బాట్‌కు చోటు దక్కొచ్చు" అని తెలిపాడు.

బిల్లీ స్టాన్‌లేక్ లేదా సీన్ అబ్బాట్‌లకు చోటు!

బిల్లీ స్టాన్‌లేక్ లేదా సీన్ అబ్బాట్‌లకు చోటు!

"తుది జట్టులో సీన్ అబ్బాట్‌కు చోటు లభిస్తే సంతోషం. గత 12 నెలలుగా అతడిని చూడలేదు. దేళవాళీ క్రికెట్‌లో న్యూ సౌత్ వేల్స్ జట్టుతో పాటు ఇంగ్లాండ్‌ పర్యటనలో ఆస్ట్రేలియా ఏ జట్టు తరుపున అతడి ప్రదర్శన అద్భుతం. మంచి రిథమ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా బిగ్ బాష్ లీగ్‌లో అతడి బౌలింగ్ చూస్తూనే ఉన్నాం" అని అన్నాడు.

అబ్బాట్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు

అబ్బాట్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు

"కాబట్టి అతడు జట్టులో ఉండటం లాభించే విషయమే. అతనికి అవకాశం వస్తుందని అనుకుంటున్నా. మంచి విషయం ఏంటంటే అతను గొప్ప ఫామ్‌లో ఉన్నాడు" అని ప్యాట్ కమ్మిన్స్ రెండో టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. మూడు టీ20ల సిరిస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

తొలి టీ20లో ఆసీస్ రికార్డు విజయం

తొలి టీ20లో ఆసీస్ రికార్డు విజయం

ఆదివారం అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకపై ఆస్ట్రేలియా 134 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత వార్నర్‌ సెంచరీతో చెలరేగగా.. అనంతరం బౌలర్లు లంక బ్యాట్స్‌మన్‌ను ఓ ఆటాడుకున్నారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆసీస్‌ జట్టు టీ20ల్లోనే అత్యుత్తమ విజయం సాధించింది.

Story first published: Monday, October 28, 2019, 15:18 [IST]
Other articles published on Oct 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+