Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా వస్తే నీ అంతుచూస్తా!: అశ్విన్‌పై స్టార్క్ సంచలనం

హైదరాబాద్: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అశ్విన్‌కు బౌలింగ్‌ చేసి అతని నుదుటిపై బంతిని సంధించాలని తాను కోరుకుంటున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మిచెల్ స్టార్క్‌ అన్నాడు.

భారత్, ఆస్ట్రేలియాల మధ్య బెంగుళూరులో ముగిసిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ బౌలింగ్‌లో స్టార్క్‌ అవుటయ్యాడు. స్టార్క్‌ను అవుట్ చేసిన ఆనందంలో అశ్విన్ తన నుదుటిపై వేలుపెట్టి చేసిన సంజ్ఞ స్టార్క్‌కు కోపం తెప్పించింది. అదే టెస్టులో స్టార్క్‌ బౌలింగ్‌లో భారత ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ సిక్స్‌ కొట్టగా తలరాత అన్నట్లుగా స్టార్క్‌ అదే తరహాలో సైగ చేశాడు.

Mitchell Starc threatens to hit Ravichandran Ashwin on the head with a bouncer

బెంగుళూరు టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ బౌలింగ్‌లోనే స్టార్క్ అవుటయ్యాడు. ఇదిలా ఉంటే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ మాటల యుద్ధానికి భారత జట్టే కారణమని కూడా స్టార్క్‌ ఆరోపించడం విశేషం.

బెంగుళూరు టెస్టు అనంతరం గాయపడిన మిచెల్ స్టార్క్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. బెంగుళూరు టెస్టులో 188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు ధర్మశాలలో ఈ నెల 25న ప్రారంభంకానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+