ప్రాక్టీస్ సెషన్లో ఆసిస్ ఆటగాడికి గాయం, ఆసుపత్రికి తరలింపు
సిడ్నీ: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ గాయపడి, ఆసుపత్రి పాలయ్యాడు. సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కాలుకు గాయం అయింది. దీంతో అతనిని ఆసుపత్రిలో చేర్పించినట్లు తోటి ఆటగాళ్లు చెప్పారు. స్టార్క్ ఎడమ కాలికి గాయం కావడంతో వైద్య సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స నిర్వహించారు.

గాయం తీవ్రంగా ఉండటంతో వెంటనే అంబులెన్సులో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవల శ్రీలంక - ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో, వన్డే, ట్వంటీ 20లో స్టార్క్ మంచి ప్రదర్శన కనబరిచాడు. త్వరలో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
దక్షిణాఫ్రికా వెళ్లే ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్‌ను ఎంపిక చేయలేదు. అందుకు ఓ కారణం ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత ఆస్ట్రేలియా భారత్ పర్యటనకు రానుంది. ఆ జట్టులో స్థానం కల్పించేందుకు స్టార్క్‌కు ఇప్పుడు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం అతను గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications