Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్క్‌ను ఎగ‌తాళి చేసిన ఇంగ్లండ్ అభిమానులు: ఆ కోపాన్ని ఆట‌గాళ్ల‌పై చూపాడా?

ICC Cricket World Cup 2019 : Mitchell Starc’s Wife Reveals How An England Fan’s Taunt Fired Him Up
Mitchell Starc’s wife reveals how an England fan’s taunt fired him up

లండ‌న్‌: నిప్పులు కురిపించే బంతుల‌కు పెట్టింది పేరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్ మిఛెల్ స్టార్క్. ఖ‌చ్చిత‌మైన లైన్ అండ్ లెంగ్త్‌ను అనుస‌రిస్తూ అత‌ను వేసే బంతుల‌ను ఎదుర్కొనాలంటే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు గుండెల్లో ద‌డ పుడుతుంది. బ‌హుశా- ఇలాంటి అనుభ‌వాన్నే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు కూడా చ‌వి చూసి ఉండొచ్చు. లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో మంగ‌ళ‌వారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా మిఛెల్ స్టార్క్ చెల‌రేగిపోయి బౌలింగ్ చేశాడు. 43 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ నాలుగింట్లో బెన్‌స్టోక్స్‌ను అవుట్ చేసిన బంతి.. ఇప్ప‌టిదాకా జ‌రిగిన మ్యాచ్‌ల‌న్నింట్లోకీ హైలైట్‌గా చెప్పుకోవ‌చ్చు. మిడిలార్డ‌ర్‌లో కుదురుకుని, భారీ షాట్ల‌ను ఆడుతూ జ‌ట్టును విజ‌యం దిశ‌గా తీసుకెళ్తున్న బెన్‌స్టోక్స్‌ను ఓ అద్భుత‌మైన యార్క‌ర్‌తో బ‌లిగొన్నాడు స్టార్క్‌.

కోలుకోని విధంగా దెబ్బ‌తీసిన ఫాస్ట్ బౌల‌ర్లు..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది కంగారూల జ‌ట్టు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. మొత్తం 50 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 285 ప‌రుగుల చేసింది. కేప్టెన్ అరోన్ ఫించ్ సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో అతనికి ఇది రెండో సెంచ‌రీ. ఆ త‌రువాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్ ఆశించిన స్థాయిలో ప‌రుగులు పెట్ట‌లేదు. వంద ప‌రుగుల్లోపే నాలుగు కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. క‌ష్టాల్లో ప‌డింది. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ బెన్‌స్టోక్స్ ఒక్క‌డే ఆస్ట్రేలియా బౌల‌ర్లు సంధిస్తోన్న నిప్పులు చెరిగే బంతుల‌ను ఎదురొడ్డి నిలిచాడు. 89 ప‌రుగులు చేశాడు. చివ‌రికి- 64 ప‌రుగుల తేడాతో ఓట‌మి చూసింది ఇంగ్లీష్ టీమ్‌. బెహెర్డియ‌న్ అయిదు, స్టార్క్ నాలుగు వికెట్ల‌ను పడ‌గొట్టారు.

భార‌త్‌పై గెలిచి తీరాల్సిన స్థితిలో ఇంగ్లండ్‌..

భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులు, అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ఉత్కంఠత‌తో మ్యాచ్‌ను తిల‌కిస్తారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉంటుంది అభిమానుల నుంచి. దీనికి ప్ర‌ధాన కార‌ణం యాషెస్ సిరీస్‌. ఈ సిరీస్ వ‌ల్ల ఈ రెండు దేశాల మ‌ధ్య క్రికెట్ పోటీల్లో ఓ ర‌క‌మైన యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. ఉద్విగ్న‌భ‌రితంగా మ్యాచ్ కొన‌సాగుతుంది. ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా లార్డ్స్‌లో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా కూడా అదే త‌ర‌హా వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తూ ఊపు మీద ఉన్న కంగారూల జ‌ట్టుకు ఇంగ్లండ్ టీమ్ క‌ళ్లెం వేస్తుంద‌ని ఆశించారు. ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌రిస్థితి ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని టీమిండియా, న్యూజీలాండ్ జ‌ట్ల‌ను ఎదుర్కొనాల్సి ఉంది ఇవాన్ మోర్గాన్ టీమ్‌కు. ఈ రెండింట్లో ఏ ఒక్క దాంట్లో ఓడిపోయినా.. ఇంగ్లండ్ జ‌ట్టుకు నిరాశ త‌ప్పని ప‌రిస్థితి త‌లెత్తింది.

ఎగ‌తాళి చేశారా?

అద‌లావుంచితే- మిఛెల్ స్టార్క్ ఇంత‌లా చెల‌రేగిపోయి ఆడ‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ని అత‌ని భార్య అలీసా హీలీ చెబుతున్నారు. అలీసా.. ఆస్ట్రేలియ మ‌హిళా జ‌ట్టు క్రికెట‌ర్ కూడా. ఆస్ట్రేలియా జాతీయ మ‌హిళా జ‌ట్టులో అలీసా వికెట్ కీప‌ర్‌. మ్యాచ్ ఆరంభం కావ‌డానికి ముందు- స్టేడియం లోప‌ల బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న స‌మ‌యంలో కొంద‌రు ఇంగ్లండ్ అభిమానులు స్టార్క్‌ను ఆట‌ప‌ట్టిస్తూ కామెంట్స్ చేశార‌ట‌. ఆ స‌మ‌యంలో తాను అక్క‌డే ఉన్నాన‌ని అలీసా తెలిపారు. మిఛెల్ స్టార్క్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమ‌యంలో కొంద‌రు ఇంగ్లీష్ టీమ్ అభిమానులు అటుగా వ‌చ్చార‌ని, వారు ఎద్దేవా చేశార‌ని వివ‌రించారు. వారు చేసిన కామెంట్ల ప‌ట్ల స్టార్క్ అస‌హ‌నంగా క‌నిపించార‌ని అన్నారు. ఆ కోపాన్ని, అస‌హ‌నాన్ని ఇంగ్లండ్ క్రికెట‌ర్ల‌పై చూపిన‌ట్టుగా ఉంద‌ని అలీసా చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ఆమె మ్యాచ్ ముగిసిన కొద్దిసేప‌టికే ఓ ట్వీట్ చేశారు.

ట్విట్ట‌రెట్టీల ప్ర‌శంస‌లు..

అలీసా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. అలీసా చేసిన ట్వీట్‌కు ఆస్ట్రేలియా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు అందుతున్నాయి. దెబ్బ‌కు దెబ్బ కొట్టార‌ని ఆ దేశ క్రికెట్ జ‌ట్టు అభిమానులు, ట్విట్ట‌రెట్టీలు కితాబు ఇస్తున్నారు. అటు స్టార్క్‌, ఇటు అలీసా.. ఇద్ద‌రూ మాంఛి ఫైర్ మీద ఉన్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా ఎదుర్కొన‌బోయే అన్ని మ్యాచ్‌ల‌లోనూ ఇదే త‌ర‌హా ఫైర్‌ను చూపాల‌ని వారు కోరుకుంటున్నారు. ఇదే త‌ర‌హా పోరాట స్ఫూర్తి, క‌సిని స్టార్క్‌లో ర‌గిలించాల‌ని ట్విట్ట‌రెట్టీలు అలీసాను కోరుతున్నారు. ప్రపంచ‌క‌ప్‌ను గెలిచి విశ్వ విజేత‌గా ఆస్ట్రేలియా జ‌ట్టు ఆవిర్భ‌వించ‌గ‌లిగితే- ఇందులో అలీసాకూ భాగస్వామ్యురాలు అవుతార‌ని కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Wednesday, June 26, 2019, 13:11 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+