టెక్ట్స్ మెసేజ్ చేశారు: స్టార్క్‌తో కేకేఆర్ ఐపీఎల్ ఒప్పందం రద్దు


హైదరాబాద్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని మిచెల్ స్టార్క్ స్వయంగా వెల్లడించడం విశేషం. తన ఐపీఎల్ కాంట్రాక్ట్ రద్దు విషయాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రాంఛైజీ టెక్ట్స్ మెసేజ్ ద్వారా తెలియజేసిందని మిచెల్ స్టార్క్ తెలిపాడు.
సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మిచెల్ స్టార్క్ మాట్లాడుతూ "కోల్‌కతా ఫ్రాంఛైజీ యాజమాన్యం నుంచి రెండు రోజుల క్రితం ఒక టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. ఆ ఫ్రాంఛైజీ నన్ను జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో వచ్చే ఏప్రిల్‌లో నేను స్వదేశంలోనే ఉంటాను" అని స్టార్క్ తెలిపాడు.

రూ.9.4 కోట్లు వెచ్చించి స్టార్క్‌ను కొనుగోలు చేసిన కోల్‌కతా
2018 ఐపీఎల్ వేలంలో మిచెల్ స్టార్క్‌కు అత్యధికంగా రూ.9.4 కోట్లు వెచ్చించి కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే కాలి గాయం కారణంగా స్టార్క్ ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో స్టార్క్ సేవలను కోల్‌కతా నైట్‌రైడర్స్ పూర్తిగా కోల్పోయింది.

గాయం నుంచి కోలుకోవడంతో పాక్‌తో టెస్టు సిరిస్‌కు
28 ఏళ్ల మిచెల్ స్టార్క్ గాయం కారణంగా ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ గాయం నుంచి కోలుకోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు.

భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరిస్‌కు దూరం
అయితే, అబుదాబి వేదికగా జరిగిన రెండో టెస్టులో మిచెల్ స్టార్క్ గాయం తిరగబెట్టడంతో... టెస్టు సిరిస్ ముగిసిన అనంతరం పాకిస్థాన్‌తో జరిగిన మూడు టీ20 సిరిస్ నుంచి తప్పుకున్నాడు. నవంబర్ 21 నుంచి భారత్‌తో జరగనున్న మూడు టీ20ల సిరిస్ నుంచి కూడా స్టార్క్‌ను ఆసీస్ సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.

గురువారమే చివరి రోజు కావడంతో కోల్‌కతా ఈ నిర్ణయం
ఐపీఎల్ 2019 సీజన్ కోసం అట్టిపెట్టుకునే, విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు గురువారమే చివరి రోజు కావడంతో ఆయా ఫ్రాంఛైజీలు తుది జాబితాను ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 29న ఆరంభమై మే 19న ముగియనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications