సిడ్నీ: ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 సీజన్‌లో తాను ఆడాలని కోరుకున్నట్లు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తెలిపాడు. మోకాలి గాయం కారణంగా గత నవంబరు నుంచి విశ్రాంతి తీసుకుంటున్న స్టార్క్ జనవరి 12 నుంచి భారత్‌తో జరిగే సిరీస్‌కి కూడా దూరమయ్యాడు.
అయితే తాను ఐపీఎల్ సమయానికి పూర్తిగా కోలుకుంటానని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) బోర్డుకు విన్నవించాడు. అయితే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా బోర్డు నుంచి అనుమతి లభించలేదని స్టార్ట్ వెల్లడించాడు.

ఐపిఎల్ తోపాటు ఆ తర్వాత జరిగే ముక్కోణపు సిరీస్‌లో కూడా ఆడతానని స్పస్టం చేశాడు. కాగా, గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన స్టార్క్ పరుగులు కట్టడి చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.