Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : బంతితో నిప్పులు చెరుగుతున్న ఆసీస్ పేసర్.. భారత్‌కు తిప్పలు తప్పవా?

Mitchell Starc insane in-swingers ready for third test

భారత్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీను ఆస్ట్రేలియా జట్టు చాలా పేలవంగా ఆరంభించింది. తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని ఆ జట్టు గట్టి పట్టుదల ప్రదర్శిస్తోంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేస్తుండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశంలా కనిపిస్తోంది. అలాగే యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.

వీళ్లిద్దరూ కూడా గాయాల కారణంగా తొలి రెండు టెస్టుల్లో ఆడలేదు. ఇప్పుడు వీళ్లిద్దరి రాకతో ఆసీస్ బలం రెట్టింపైందనే చెప్పాలి. కామెరూన్ గ్రీన్ కేవలం బ్యాటుతోనే కాకుండా, బంతితోనూ రాణించగల సమర్ధుడు. ఇక స్టార్క్ ఎంత అద్భుతమైన బౌలరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించగల సత్తా అతని సొంతం. వేలి గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన అతను.. మూడో టెస్టు ఆడే ఫిట్‌నెస్ సాధించినట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే నెట్స్‌లో గ్రీన్, స్టార్క్ ఇద్దరూ ప్రాక్టీస్ చేశారు. స్టార్క్ వేసిన బంతులను ఎదుర్కోవడానికి గ్రీన్ తడబడ్డాడు. ఈ సమయంలో స్టార్క్ వేసిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు గ్రీన్ వద్ద సమాధానం లేకపోయింది.

బంతి స్ట్రెయిట్‌గా వెళ్లిపోతుందని అనుకున్న గ్రీన్ దాన్ని వదిలేశాడు. కానీ ఇన్‌స్వింగ్ అయినా ఆ బంతి వికెట్లను కూల్చింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది భారతీయ అభిమానులు స్టార్క్‌తో టీమిండియాకు కొన్ని తిప్పలు తప్పవని అంటున్నారు. మరి మూడో మ్యాచులో భారత జట్టు ఎలా ఆడుతుందో చూడాలి. కాగా, ఈ మ్యాచులో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడటం లేదు. అతని స్థానంలో స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు సారధ్యం వహిస్తాడు. అలాగే డేవిడ్ వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ బాధ్యతలు పంచుకుంటాడు.

Story first published: Monday, February 27, 2023, 17:51 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+