న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్న్ చెప్పింది వింటే రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే!!

India vs Australia 2nd Test : Mitchell Starc Hits Back At Aussie legend Shane Warne | Oneindia
Mitchell Starc hits back at Aussie legend Shane Warne

పెర్త్: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నప్పటికీ షేన్ వార్న్ మాటలు చెంపపెట్టులా తయారవుతున్నాయి. ఆస్ట్రేలియా జట్టులోని అత్యుత్తమ బౌలర్లలో పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఒకడు. చురకత్తుల్లాంటి బంతులతో అతడు గొప్ప బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. అతడి బౌలింగ్‌ ఎదుర్కోవాలంటేనే ఎంతో మంది భయపడేవారు. కాగా తరచూ గాయాల పాలవుతుండటంతో అతడి లయ దెబ్బతింది. ప్రస్తుతం రాణిస్తున్నా నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. స్టార్క్‌ సామర్థ్యంపై షేన్‌వార్న్‌ ఎప్పుడూ సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉంటాడు. అతడి దేహభాష బాగాలేదని 2015లో విమర్శించాడు. దాంతో 'నిరూపించడానికేమీ లేదు' అని స్టార్క్‌ తిప్పికొట్టాడు.

తరచూ గాయాల పాలవుతూ లయ కోల్పోయాడని

టీమిండియాతో టెస్టు సిరీస్‌ సందర్భంగానూ స్టార్క్‌పై వార్న్‌ విమర్శలు చేశాడు. తరచూ గాయాల పాలవుతుండటంతో అతడు లయ కోల్పోయాడని అన్నాడు. దీనిపై స్టార్క్‌ మీడియాతో మాట్లాడాడు. అతడి మాటలు వింటూ పోతే క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిందే అని పేర్కొన్నాడు. ‘అతడేమన్నాడో నాకు తెలియదు. ఆయన మాటల గురించి నాకు చెబుతున్నారు. వార్న్‌ మాటలు వింటూ పోతే నేనిక రిటైర్‌ కావాల్సిందే. నా సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ వెళ్తాను' అని స్టార్క్‌ అన్నాడు. టీమిండియాతో తొలి టెస్టులో 5, పెర్త్‌ టెస్టులో 3 వికెట్లు తీశాడు.

మురళీ విజయ్ తొలి వికెట్‌ను డక్ అవుట్‌గా

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మురళీ విజయ్ తొలి వికెట్‌ను డక్ అవుట్‌గా పంపించాడు. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ టిమ్ పైనె మాట్లాడుతూ.. రెండో టెస్టులో స్టార్క్ అద్భుతాలు సృష్టిస్తాడంటూ తెలిపినా మురళీ విజయ్ అవుట్ మినహాయించి ఆశించినంత మేర రాణించలేకపోయాడు.

కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తుతూ

అయితే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పెర్త్ వేదికగా విరాట్ కోహ్లీ రెచ్చిపోయి సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మరెవ్వరూ ఆడలేనంత దూకుడును ప్రదర్శించి క్రీజులో నిలబడ్డాడు. ఈ విషయంపై స్పందించిన షేన్ వార్న్ పొగడ్తలతో ముంచెత్తాడు. 'విరాట్ కోహ్లీకి అభినందనలు. అద్భుతమైన సెంచరీని బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ గ్రహంపైన ఇంతబాగా రాణించగల మరో క్రికెటర్ లేడు. అది చూసి చాలా ఎంజాయ్ చేశాను' అంటూ ట్వీట్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

1
43624
Story first published: Tuesday, December 18, 2018, 10:14 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X