9 వికెట్లతో స్టార్క్ విజృంభణ.. కివీస్‌పై ఆసీస్ భారీ విజయం!!

పెర్త్: స్వదేశంలో డే/నైట్ టెస్టుల్లో ఆ్రస్టేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు డే/నైట్ టెస్టుల్లో విజయం సాధించిన ఆసీస్.. మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఆ సంఖ్యను ఏడుకు పెంచుకుంది. న్యూజిలాండ్‌తో నాలుగో రోజే ముగిసిన డే/నైట్ తొలి టెస్టులో ఆ్రస్టేలియా 296 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసీస్ పేసర్ మిషెల్ స్టార్క్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లతో విజృంభించడంతో కివీస్ విలవిలలాడింది.

స్టార్క్ విజృంభణ
468 పరుగుల లక్ష్యంతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. స్టార్క్ (4/45), నాథన్ లియాన్ (4/63) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 65.3 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. వాట్లింగ్ (40), గ్రాండ్‌హోమ్ (33) పోరాడారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 167/6తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్.. 217/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ డిక్లేర్ చేసి న్యూజిలాండ్‌కు 468 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ బౌలర్లలో టీం సౌథీ ఐదు, వాగ్నర్ మూడు వికెట్లు పడగొట్టారు.

లబుషేన్ సెంచరీ
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కులు చూపించారు. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే ఆలౌట్ అయింది. 250 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ఆడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

మెల్‌బోర్న్‌లో రెండో టెస్టు
ఈ విజయంతో ఆ్రస్టేలియా మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. రెండో టెస్టు ఈనెల 26న మెల్‌బోర్న్‌లో మొదలవుతుంది. ఈ టెస్ట్ ద్వారా పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. అలీమ్ ఇప్పటివరకు ఆన్‌ఫీల్డ్ అంపైర్‌గా 129 టెస్టులకు బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో వెస్టిండీస్ అంపైర్ స్టీవ్ బక్నర్ (128) పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్ రికార్డును అలీమ్ దార్ బద్దలు కొట్టారు.

ప్రపంచంలోనే చెత్త కీపర్
ఈ టెస్ట్ మూడో రోజు ఆటలో భాగంగా ఆ్రస్టేలియా టెస్టు కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ తన చెత్త కీపంగ్‌తో కివీస్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్‌ను రనౌట్ చేయలేకపోయాడు. పైన్ రనౌట్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది చూసిన ఆసీస్ అభిమానులు అతన్ని ఓ ఆటాడుకుంటున్నారు. 'ప్రపంచంలోనే చెత్త కీపర్' అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. 'పైన్ జట్టులో ఎందుకున్నాడో నాకర్థం కావడం లేదు' అని మరో నెటిజన్ మండిపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications