Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్క్ ఉగ్రరూపం: 172 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా ప్రదర్శన చేయడంతో ఇంగ్లండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 172 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. దూకుడుగా ఆడే 'బేజ్‌బాల్' వ్యూహాన్ని అమలు చేయాలని భావించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా పేస్ ఎటాక్ ఆదిలోనే కళ్లెం వేసింది.

పోప్‌, బ్రూక్‌ల పోరాటం
ఇంగ్లండ్‌ బ్యాటర్లలో అత్యధికంగా పరుగులు చేసింది ఇద్దరే కావడం గమనార్హం. హ్యారీ బ్రూక్ (52 పరుగులు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసి జట్టుకు కొంత ఉపశమనం అందించాడు. ఓలీ పోప్ (46 పరుగులు) కూడా బ్రూక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు గట్టి పోరాటం చేశాడు. వీరితో పాటు జెమీ స్మిత్ (33), ఓపెనర్ బెన్ డకెట్ (21) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లంతా ఆసీస్ పేస్ దాడి ముందు చేతులెత్తేశారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించలేకపోయింది.

Mitchell Starc Destroys England for 172 7-Wicket Fury in Ashes 1st Test at Perth

7 వికెట్లతో స్టార్క్ విధ్వంసం
ఇంగ్లండ్‌ పతనంలో ప్రధాన పాత్ర పోషించింది ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. తన పదునైన స్వింగ్‌, వేగంతో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను స్టార్క్ కూల్చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 7 వికెట్లు పడగొట్టగా.. బ్రెండన్ డొగ్గెట్ 2 వికెట్లు, క్యామెరాన్ గ్రీన్ ఒక వికెట్ తీశాడు. స్టార్క్ ఏకంగా 7 వికెట్లు తీయడం ఆస్ట్రేలియాకు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 172 పరుగులకే తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ కావడంతో, ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించి, తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సంపాదించేందుకు సిద్ధమవుతోంది. యాషెస్ ఆరంభంలోనే పైచేయి సాధించిన ఆసీస్, ఇంగ్లండ్‌పై ఒత్తిడిని మరింత పెంచింది.

Story first published: Friday, November 21, 2025, 12:19 [IST]
Other articles published on Nov 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+