కళ్లు చెదిరే యార్కర్‌తో స్టోక్స్‌ను ఔట్ చేసిన మిచెల్ స్టార్క్ (వీడియో)

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా మంగళవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని సెమీస్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, మార్క్ వుడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

286 పరుగుల విజయ లక్ష్యంతో
అనంతరం 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ల ఖాతా తెరిచింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ జేమ్స్ విన్స్ (0)ను బెహ్రన్‌డార్ఫ్ క్లీన్‌బౌల్డ్ చేయగా.. మిచెల్ స్టార్క్ అద్భుత బంతికి జో రూట్ (8) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక పుల్ షాట్ ఆడబోయి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (4) క్యాచ్ ఔట్ అయ్యాడు. 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

56 పరుగులకే నాలుగు వికెట్లు
ఈ దశలో బెయిర్‌స్టో (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసాడు. అయితే బెయిర్‌స్టోను బెరెన్‌డార్ఫ్ ఔట్ చేశాడు. 56కే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సమయంలో పోరాటపటిమను ప్రదర్శించిన స్టోక్స్.. బట్లర్ (25)తో కలిసి వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. అతడితో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
స్టార్క్ వేసిన అద్భుత యార్కర్‌కు
రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించున్న బట్లర్.. మిచెల్ స్టార్క్ ఓ తిరుగులేని యార్కర్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. స్టార్క్ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో బెన్ స్టోక్స్ సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. బెన్ స్టోక్స్ బౌల్డ్ కావడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు మొగ్గింది. క్రీజులో నిలదొక్కుకుని నిలకడగా ఆడుతోన్న స్టోక్స్ ఔట్ కావడంతో ఆసీస్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

నాలుగు వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్
మిడిల్ ఓవర్లలో బెన్‌స్టోక్స్ (89: 115 బంతుల్లో 8 పోర్లు, 2 సిక్సులు) నిలకడగా ఆడటంతో గెలిచేలా కనిపించింది. అయితే, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (4), జోస్ బట్లర్ (25), మొయిన్ అలీ (6), జో రూట్ (8) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఒత్తిడికి గురైన ఆ జట్టు 44.4 ఓవర్లలోనే 221 పరుగులకి ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో బెరండ్రాఫ్ ఐదు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications