19 వికెట్లు: జోఫ్రా ఆర్చర్‌ను వెనక్కి నెట్టిన మిచెల్ స్టార్క్

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అధిగమించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో ఈ మెగా టోర్నీలో 19 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 29 ఏళ్ల మిచెల్ స్టార్క్ మంగళవారం నాటి మ్యాచ్‌లో జో రూట్, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, అదిల్ రషీద్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ 4-43 గణాంకాలను నమోదు చేశాడు.

16 వికెట్లతో జోఫ్రా ఆర్చర్ రెండో స్థానంలో
ఇంగ్లాండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్ 16 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా... పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ ఆమీర్(15), న్యూజిలాండ్‌కు చెందిన లుకీ ఫెర్గుసన్(14), మార్క్ వుడ్(13) వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచకప్ టోర్నీలో మిచెల్ స్టార్క్ ఇప్పటివరకు మొత్తం 39 వికెట్లు పడగొట్టాడు.

కేవలం ఎనిమిది మంది బౌలర్లు మాత్రమే
ప్రపంచకప్ చరిత్రలో కేవలం ఎనిమిది మంది బౌలర్లు మాత్రమే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇందులో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మిచెల్ స్టార్క్ 15 వికెట్లు పడగొట్టాడు. ఇక, 2015 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్డ్‌తో కలిసి సంయుక్తంగా స్టార్క్ అగ్రస్థానంలో నిలిచాడు.

2015 వరల్డ్‌కప్‌లో సైతం
వీరిద్దరూ 22 వికెట్లు తీసుకున్నారు. ఇక, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యంతో ఆసీస్ చేతిలోనూ చావుదెబ్బ తింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక టోర్నీలో మూడో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది.

12 పాయింట్లతో అగ్రస్థానంలో
దీంతో సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియా మాత్రం అదరగొట్టే ఆటతో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆసీస్.. వరుసగా నాలుగో విజయాన్ని అందుకొని ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ప్రస్తుతం 12 పాయింట్లతో ఆస్ట్రేలియా పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించింది. టీమిండియాతో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications