Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ మెగా వేలం.. ఆ ఇద్ద‌రు స్టార్ ప్లేయ‌ర్లు డౌటే!

Mitchell Starc and Ben Stokes are doubtful for IPL Mega Auction Participate.

ఐపీఎల్ మెగా వేలానికి మ‌రో నెల కూడా స‌మ‌యం లేదు. దీంతో మెగా వేలంలో ఈ సారి ఎవ‌రెవ‌రు పాల్గొంటున్నార‌నే అంశంపై అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. మెగా వేలంలో పాల్గొనే స్వ‌దేశీ ఆట‌గాళ్ల‌పై ఓ క్లారిటీ ఉన్న‌ప్ప‌టికీ విదేశాల‌కు చెందిన స్టార్ ఆట‌గాళ్ల పైనే అంద‌రి చూపు నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్‌, ఆస్ట్రేలియా స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ ఈ వేలంలో పాల్గొన‌డం అనుమాన‌మే అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం ప్ర‌కారం స్టార్క్‌, స్కోక్స్ వేలంలో పాల్గొన‌డం క‌ష్ట‌మే అంటున్నారు. ఐపీఎల్‌లో ఐదేళ్లుగా ఆడుతున్న స్టోక్స్ చివ‌రి ఎడిష‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 43 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్‌.. 25 స‌గ‌టుతో 920 ప‌రుగులు చేశాడు. 2 సెంచ‌రీలు, 2 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 107 ప‌రుగులు. అదే స‌మ‌యంలో 28 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 3/15.

ఆస్ట్రేలియా స్టార్ పేస‌ర్ మిచెల్ స్టార్క్ ఈ సారి కూడా ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన‌డం అనుమానంగానే మారింది. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో స్టార్క్ రెండు ఎడిష‌న్లు మాత్ర‌మే ఆడాడు. అది కూడా 2014-2015లో ఆడాడు. అప్పుడు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. అయితే ఆ త‌ర్వాత‌ అనివార్య కార‌ణాల‌తో ఐపీఎల్‌లో ఆడ‌లేదు. కానీ ఈ సారి ఆడ‌నున్న‌ట్లు ముందు ప్ర‌క‌టించాడు. కానీ ప్రస్తుతం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంటున్న‌ట్లు స‌మాచారం. దీంతో స్టార్క్ ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొన‌డం అనుమానంగా మారింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు తన కెరీర్‌లో ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్ 34 వికెట్లు తీశాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 4/15.

కాగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా ఈ సారి మెగా వేలంలో పాల్గొన‌డం లేద‌ని తాజాగా ప్ర‌క‌టించాడు. గ‌తంలో ఈ సారి ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటాన‌ని చెప్పాడు. కానీ తాజాగా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోవ‌డంతో త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడు. తాను త‌న జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించ‌డానికే మొద‌టి ప్రాధాన్యం ఇస్తాన‌ని చెప్పాడు. కాగా రూట్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి కూడా ఐపీఎల్‌లో ఆడ‌లేదు. 2018లో వేలంలో పాల్గొన్న‌ప‌టికీ ఏ జ‌ట్టు కోనుగోలు చేయ‌లేదు.

Story first published: Monday, January 17, 2022, 17:06 [IST]
Other articles published on Jan 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+