రోహిత్ గాయమే కోహ్లీసేన కొంప ముంచింది: న్యూజిలాండ్ పేసర్హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై భారత దారుణ ఓటమికి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయమే కారణమని కివీస్ వెటరన్ పేసర్ మిచెల్‌ మెక్‌ క్లెనఘన్‌ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన క్రికెట్ టోర్నీలు రద్దవ్వడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితయ్యారు. ఈ మహమ్మారి కారణంగా ఐపీఎల్ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అది జరుగుతుందో లేదో అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. దీంతో ఐపీఎల్ ఆడాల్సిన విదేశీ ఆటగాళ్లు నిరాశకు లోనవుతున్నారు. ప్రాణాంతక వైరస్ నిర్మూలనకు స్వీయ నిర్భంధంలో ఉంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పలు సూచనలు చేస్తున్నారు. ఇంకొందరూ అభిమానులతో చిట్‌చాట్ చేస్తున్నారు.
New Zealand Pacer Shocking Comments On Dhoni & Rohit Sharma

స్వియ నిర్భంధంలో మెక్ క్లనఘన్..

ఇక న్యూజిలాండ్‌కి చెందిన మిచెల్ మెక్ క్లనఘన్ ఇటీవల పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌లో ఆడి స్వదేశానికి వెళ్లాడు. అయితే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. అన్ని దేశాల ప్రభుత్వాలు.. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు స్వియ నిర్భంధంలో ఉండాలని ఆదేశించాయి. దీంతో.. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో మిచెల్ మెక్ క్లనఘన్ ఉన్నాడు. వాస్తవానికి పాక్ నుంచి స్వదేశానికి వచ్చే ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. మెక్లనగాన్‌ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో నెగటివ్ వచ్చింది.

భేష్ వార్న్.. నువ్వు మా క్రికెటర్లలా కాదులే!!

#AskMitch session ఆసక్తికర ఆన్సర్స్..

ఇక ఇంటికే పరిమితమైన ఈ ముంబై ఇండియన్స్ పేసర్ శనివారం తన ట్విటర్ అకౌంట్‌లో #AskMitch session నిర్వహించాడు. అభిమానులు అడిగిన పలు ఆసక్తికరప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ సెషన్‌లో భాగంగా ఓ భారత అభిమాని న్యూజిలాండ్ గడ్డపై భారత ఓటమికి రోహిత్ శర్మ లేకపోవడమే కారణమా? అని ప్రశ్నించాడు. దీనికి మెక్ క్లెనఘన్ కూడా అవుననే సమాధానమిచ్చాడు. మరో యూజర్ రోహిత్‌లో స్పూర్తినిచ్చే అంశం ఏంటని అడగ్గా.. అతనో గొప్పనాయకుడని బదులిచ్చాడు.

పిచ్చి ప్రశ్నలు వద్దు..

ఇక ఇండియన్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరనే పిచ్చి ప్రశ్నలు అడగవద్దని, రోహిత్ శర్మనే నా ఫేవరేట్ అని అందరికి తెలుసని ఈ కివీస్ పేసర్ అసహనం కూడా వ్యక్తం చేశాడు. రోహిత్, మిచెల్ చాలా కాలంగా ముంబైకి ఆడుతున్న విషయం తెలిసిందే. ముంబై చాంపియన్‌గా నిలిచిన 2015,17,19 సీజన్ల‌లో మెక్ క్లనఘన్ రాణించాడు.

ధోనీకి బౌలింగ్ చేయలేం బాబోయ్..

ధోనీకి బౌలింగ్ చేయలేం బాబోయ్..

ధోనీ గురించి కొన్ని విషయాలు చెప్పండని ఓ అభిమాని ప్రశ్నించగా.. అతనికి బౌలింగ్ చేయకూడదు బాబోయ్..! అని సమాధానమిచ్చాడు. ఐపీఎల్‌లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌లు గెలిపించిన ధోనీ.. ఎంతో మంది బౌలర్లను చీల్చి చెండాడాడు. మెక్ క్లన్ ఘన్ కూడా ధోనీ బాధితుడే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, March 22, 2020, 12:57 [IST]
Other articles published on Mar 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X