Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

6, 6, 6, 6...మార్ష్ తుఫాన్: అభిషేక్ శర్మ రికార్డు బ్రేక్!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన కీలకపోరులో లక్నో జట్టు సీఎస్కేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.. ఈ అద్భుత విజయానికి కారణం లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసకర ఇన్నింగ్స్. మిచెల్ మార్ష్ కేవలం 38 బంతుల్లోనే 90 రన్స్ చేసి పరుగుల వరద పారించాడు. మిచెల్ మార్ష్ మెరుపు ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తూ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో నికోలస్ పూరన్ ఆడిన షాట్ బౌలర్ ముఖేష్ చౌదరి చేతులకు తగిలి వికెట్లను తాకడంతో మిచెల్ మార్ష్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ ముఖ్యంగా సీఎస్కే బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను టార్గెట్ చేశాడు. లక్నో ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆపై చివరి బంతికి ఫోర్ కొట్టాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే మొత్తం 28 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లే సమయంలో సీఎస్కే బౌలర్ ఒకరు ఇన్ని పరుగులు సమర్పించుకోవడం ఇదే తొలిసారి. గతంలో 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ముఖేష్ చౌదరి పవర్ ప్లేలో 27 పరుగులు ఇచ్చాడు.

Mitchell Marsh Storm Destroys Chennai Super Kings Breaks Abhishek Sharma Sixes Record in IPL Details

గత రెండేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా మిచెల్ మార్ష్(68 సిక్సర్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో మిచెల్ మార్ష్ సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ (65 సిక్సర్లు) ను వెనక్కి నెట్టాడు. మార్ష్ గత సీజన్‌లో 37 సిక్సర్లు కొట్టగా.. ప్రస్తుత 2026 సీజన్‌లో ఇప్పటివరకు 31 సిక్సర్లు సాధించాడు. లక్నో సూపర్ జాయింట్స్ తరఫున ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో నికోలస్ పూరన్ (2025లో 40 సిక్సర్లు) తర్వాత మార్ష్ రెండో స్థానంలో ఉన్నాడు.

పవర్‌ప్లేలో లక్నో జట్టును మార్ష్ ముందుండి నడిపించాడు. తొలి 6 ఓవర్లలోనే మిచెల్ మార్ష్ విధ్వంసకరంగా ఆడి ఒంటరిగానే 60 పరుగులు చేశాడు. లక్నో తరఫున పవర్‌ప్లేలో మార్ష్ హాఫ్ సెంచరీ మార్కును దాటడం ఇది మూడోసారి కావడం విశేషం. మార్ష్ జోరుతో లక్నో జట్టు పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో లక్నో జట్టుకు ఇది మూడో అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్‌ల మధ్య మొదటి వికెట్‌కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ జోడీ కోల్‌కతాపై చేసిన 210* పరుగులు లక్నో తరఫున ఇప్పటికీ అత్యధిక భాగస్వామ్యంగా కొనసాగుతోంది. మార్ష్ అద్భుత ప్రదర్శనతో లక్నో ఈ విజయాన్ని అందుకోవడమే కాకుండా సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా క్లిష్టం చేసింది.

Story first published: Saturday, May 16, 2026, 9:13 [IST]
Other articles published on May 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+