న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డ్రెస్సింగ్‌ రూమ్‌ గోడకు పంచ్‌.. ఇడియట్‌ అని తిట్టిన కోచ్!!

Mitchell Marsh said Australia Coach Justin Langer Told Me Im An Idiot

పెర్త్‌: తీవ్ర నిరాశకు గురైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ డ్రెస్సింగ్ రూమ్ గోడకు పంచ్‌ ఇచ్చి తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. స్వీయ తప్పిదంతో గాయపడిన 27 ఏళ్ల కుడిచేతి వాటం పేసర్‌ను కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ఇడియట్‌ అంటూ మండిపడ్డాడు. యాషెష్ అనంతరం మిచెల్‌ మార్ష్‌ షెఫిల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో ఆడాడు. ఈ టోర్నీలో భాగంగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా ఉన్న మిచెల్‌ మార్ష్‌.. పెర్త్‌లో తస్మానియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం జాక్సన్‌ బర్డ్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

డెన్మార్క్‌ ఓపెన్‌.. తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా, శ్రీకాంత్‌!!డెన్మార్క్‌ ఓపెన్‌.. తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా, శ్రీకాంత్‌!!

అయితే మ్యాచ్ డ్రాగా ముగియడంతో నిరాశ చెందిన మార్ష్‌.. తన కుడి చేతిని డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న గోడకు బలంగా కొట్టాడు. అనంతరం గాయంతో విలవిల్లాడిపోయాడు. జట్టు యాజమాన్యం ఆస‍్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మార్ష్ కుడి చేతికి స్కానింగ్‌ తీయగా.. అతని మణికట్టు చిట్లినట్లు వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని వైద్యులు జట్టు యాజమాన్యానికి సూచించారు.

గాయం కారణంగా నవంబర్ 21 నుండి పాకిస్థాన్‌తో జరుగనున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌కు మార్ష్‌ దూరమయ్యాడు. తాజాగా మార్ష్‌ తన గాయంపై స్పందించాడు. మార్ష్‌ మాట్లాడుతూ... 'ఇది దురదృష్టకరమైన ఘటన. ఇలాంటి ఘటన మళ్లీ జరగదు. ఈ గాయం నాకు ఒక గుణపాఠం నేర్పింది. మిగతావారికి కూడా ఇదొక పాఠమే అని అనుకుంటున్నా. నేను చేసుకున్న తప్పిదంతో మణికట్టు వద్ద చిట్లింది. నా మధ్య వేలి కింది భాగంలో పగుళ్లు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో గెలుస్తాం. ఔట్లు కూడా అవుతాం. కానీ గోడకు పంచ్‌లు ఇవ్వొదు' అని అన్నాడు.

'గత 18 నెలల నుంచి జాతీయ జట్టులో చోటు కోసం ప్రయత్నించా. యాషెస్‌ సిరీస్‌లో అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. నా సొంత తప్పిదం ఇప్పుడు నన్ను జట్టుకు దూరం చేసింది. కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ నన్ను ఒక ఇడియట్‌ అని తిట్టాడు. నేను ఇలా గాయం చేసుకోవడంతో కోచ్ నిరుత్సాహపడ్డాడు. నేను క్షమాపణలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు' అని మార్ష్‌ పేర్కొన్నాడు.

మిచెల్‌ మార్ష్‌ తరచు గాయాల బారిన పడుతూ ఎక్కువ అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈసారి తన స్వీయ తప్పిదంతో పాక్ సిరీస్‌కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎంపిక చేయబోయే జాబితాలో ఆల్‌రౌండర్‌ కోటాలో మార్ష్‌ పేరు ముందంజలో ఉన్నా.. అతను చేసుకున్న గాయంతో మూల్యం చెల్లించుకున్నాడు.

Story first published: Thursday, October 17, 2019, 15:27 [IST]
Other articles published on Oct 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X