
అసలేం జరిగిందంటే..
ఎనిమిదో ఓవర్లో లక్నో ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌కు దిగాడు. ఆ ఓవర్ తొలి బంతికి మార్ష్ హిట్ చేయడానికి ప్రయత్నించగా బంతి మిస్సయింది. అది నేరుగా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చేతిలో పడింది. ఇక డికాక్ ఘోరంగా అప్పీలు చేయగా.. అంపైర్ కూడా ఔటిచ్చేశాడు. కృష్ణప్ప గౌతమ్ కూడా బంతి బ్యాట్‌కు కట్ అంటిందో అంటలేదో అన్నట్లు డౌట్ ఫుల్‌గా కన్పించాడు. ఇక అంపైర్ ఔటివ్వడంతో రివ్యూ తీసుకోకుండానే మార్ష్ క్రీజు వదిలి పెవిలియన్ బాట పట్టాడు. ఇక డగౌట్ చేరుకున్నాక రిప్లేలో అల్ట్రా ఎడ్జ్ చూపగా.. అతని బ్యాట్‌కు బంతి తాకలేదని తేలింది. దీంతో ఢిల్లీ డగౌట్ పూర్తిగా నిరాశచెందింది. మార్ష్ కాస్త ఆవేశపడి బయటికొచ్చాడని భావించింది. ఇక రికీ పాంటింగ్ అయితే ఘోరంగా ఫీలయ్యాడు.

రివ్యూ తీసుకుంటే మ్యాచ్ వేరేలా ఉండేది
ఇక ఈ మ్యాచ్‌లో కుదురుకున్న మార్ష్ భారీ షాట్లతో లక్నో బౌలర్లను బెంబేలెత్తించాడు. రిషబ్ పంత్‌తో కలిసి 60పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 7ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 2వికెట్లు కోల్పోయి 73పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉంది. మార్ష్ 20 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లతో 37పరుగులతో విధ్వంస రచన కొనసాగిస్తున్నాడు. ఇక 8ఓవర్లో కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌కు దిగగా మార్ష్ షాట్ కొట్టే ప్రయత్నంలో తన బ్యాట్‌కు ఎడ్జ్ అయి బంతి కీపర్ క్యాచ్‌గా మారిందనుకుని ఇన్నింగ్స్ ముగించి పెవిలియన్ వెళ్లిపోయాడు. రివ్యూ కోరుకుని ఉండుంటే మార్ష్ నాటౌట్‌గా తేలేవాడు. ఇంకాసేపు మార్ష్ క్రీజులో ఉన్నా.. మ్యాచ్ ఢిల్లీ వైపే ఉండేది.
మార్ష్ పొరపాటును మీమ్‌తో ఫన్నీగా..
మార్ష్ పొరపాటుపై టీమిండియా మాజీ క్రికెటర్ జాఫర్ కూడా తన ట్రేడ్ మార్క్ స్టైల్లో స్పందించాడు. మార్ష్‌తో పాటు పాంటింగ్‌ను, ఆసీస్ క్రికెటర్లందరినీ ఒక్క మీమ్ ద్వారా విమర్శించాడు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మున్నా భాయ్ M.B.B.S నుండి జాఫర్ ఒక మీమ్‌ను ఎంచుకుని అందులో మున్నాను బామ్మ అసలు వీడు ఆస్ట్రేలియా వాడేనా అన్నట్లు ఉంది. ఇందులో బామ్మ పాత్రను పాంటింగ్‌గా, మున్నాభాయ్ పాత్రను మార్ష్‌గా ఉదాహరించాడు. ఈ మీమ్ నెట్టింట వైరలవుతోంది. ఎలాగైన సరే గెలవాలనే ఆసీస్ ప్లేయర్లు క్రీజులో బ్యాటర్లను కవ్విస్తుంటారు.. ఫీల్డర్లు స్లెడ్జింగ్ కు దిగుతుంటారు.. ఔటయిప్పుడు ఏమాత్రం డౌట్ ఉన్నా నాటౌట్ అని తేలేదాకా క్రీజు వీడరు.. అలాంటిది మార్ష్ డౌట్ వచ్చినప్పుడు రివ్యూ తీసుకోకుండా నేరుగా డగౌట్ వైపు వెళ్లిపోయాడు. దీంతో పాంటింగ్ అసహనానికి లోనయ్యాడు. పాంటింగ్ అసహనాన్ని జాఫర్ మీమ్‌లో చూపిస్తూ.. అసలింతకు వీడు మన ఆస్ట్రేలియా బ్యాటరేనా.. ఇంత అమాయకంగా ఉన్నాడేంట్రా అన్నట్లు క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో ఢిల్లీ ఓటమి పాలయింది.


Click it and Unblock the Notifications












