న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ క్రికెటర్లకి సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకటన.. స్టార్ ఆటగాళ్లకు షాక్!!

Mitchell Marsh gets Australia contract, Usman Khawaja among six axed

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా క్రికెటర్లకి 2020-21 సీజన్‌కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ని గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రికెట్ సిరీస్‌లు అన్నీ రద్దవడంతో.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ 20 మంది‌కి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటిచ్చింది. అయితే చాలామంది స్టార్ ఆటగాళ్లకి మాత్రం సీఏ షాక్ ఇచ్చింది. గ‌తేడాది ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్‌ల‌ను విడుద‌ల చేసింది.

<strong>షోయ‌బ్ అక్త‌ర్‌కు భారీ షాక్.. 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా!!</strong>షోయ‌బ్ అక్త‌ర్‌కు భారీ షాక్.. 10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా!!

ఖవాజాకు షాక్

ఖవాజాకు షాక్

గ‌తేడాది యాషెస్ సిరీస్ మూడో టెస్టు నుంచి ఆస్ట్రేలియా జ‌ట్టుకు దూర‌మైన ఉస్మాన్ ఖ‌వాజాకు వార్షిక కాంట్ర‌క్ట్‌లో చోటు ద‌క్క‌లేదు. ఖ‌వాజాతో పాటు పీట‌ర్ హ్యాండ్స్‌కోంబ్‌, మార్క‌స్ హ‌రీస్‌, షాన్ మార్ష్‌, మార్క‌స్‌ స్టొయినిస్‌, నాథ‌న్ కౌల్ట‌ర్ నైల్ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. వీరి స్థానాల్లో కొత్త‌గా మార్న‌స్ ల‌బుషేన్‌, ఆస్ట‌న్ ఆగ‌ర్‌, జో బ‌ర్న్స్‌, మిషెల్ మార్ష్‌, మాథ్యూ వెడ్‌, కేన్ రిచ‌ర్డ్‌స‌న్ కొత్త‌గా కాంట్ర‌క్ట్ పొందారు.

లబుషేన్‌కు జాక్‌పాట్

లబుషేన్‌కు జాక్‌పాట్

సీనియర్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఐదేళ్ల తర్వాత తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్‌‌లో చోటు కోల్పోయాడు. అయితే ఇటీవల సంచలన ఇన్నింగ్స్‌లతో వెలుగులోకి వచ్చిన మార్నస్ లబుషేన్‌కి ఛాన్స్ లభించింది. లబుషేన్ యాషెస్ సిరీస్ 2019 నుండి పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్లకి 2020-21 సీజన్‌కి సంబంధించి సీఏ నుంచి వార్షిక వేతనం అందనుంది. ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు ఈ కాంట్రాక్ట్‌లోని ఆటగాళ్లకే అధిక ప్రాధాన్యత ఉంటుంది.

ల‌బుషేన్ అద్భుతం

ల‌బుషేన్ అద్భుతం

'సంప్ర‌దాయ ఫార్మాట్‌లో ఇటీవ‌ల ల‌బుషేన్ ఆట‌తీరు అబ్బుర‌ప‌రిచింది. జో రిచ‌ర్డ్‌స‌న్ కూడా మంచి టెస్టు ప్లేయ‌ర్‌. ఆగ‌ర్ విష‌యానికొస్తే.. అత‌డు టీ20ల్లో ఆక‌ట్టుకుంటున్నాడు. మూడు ఫార్మాట్‌లలో మంచి ఆటగాళ్లు ఉన్నారు. పరిస్థితులను బట్టి జట్టును ఎంచుకుంటాం. గత 12 నెలలుగా ఈ జట్టు అద్భుత విజయాలు అందుకుంది' అని సెలెక్ట‌ర్ ట్రేవ‌ర్ హ‌న్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

సెంట్రల్ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఆటగాళ్లు వీరే

సెంట్రల్ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఆటగాళ్లు వీరే

అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ ‌స్మిత్, మిచెల్ స్టార్క్, అస్టన్ అగర్, జో బర్న్స్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హఎడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ పైనీ, జేమ్స్ ప్యాటిన్ సన్, కేన్ రిచర్డ్‌సన్, జై రిచర్డ్‌సన్, మాథ్యూ వెడ్, ఆడమ్ జంపా.

Story first published: Thursday, April 30, 2020, 11:44 [IST]
Other articles published on Apr 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X