Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌండరీ లైను నుంచి విసిరిన బాల్ నేరుగా వికెట్లకి (వీడియో)

Mitchell Johnson Stuns Even Himself With This Wonder Throw From The Deep

హైదరాబాద్ : మిచెన్ జాన్సన్ చేతుల మీదుగా మరో అద్భుతం జరిగింది. ఫోర్ బౌండరీకి వెళ్లాల్సిన బంతిని ఆపి ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ అక్కడ నుంచి విసరడంతో నేరుగా వికెట్లను తాకింది. దెబ్బకి పరుగులు తీస్తున్న డామ్ బెస్ రనౌట్ గా వెనుదిరిగాడు.

మిచెల్‌ జాన్సన్‌.. 2013-14 యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను బెంబేలెత్తించిన జాన్సన్‌ మూడు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ జట్టు అంటేనే రెచ్చిపోయే మిచెల్ జాన్సన్ ఎక్కువ ఉత్సాహంతో ఆడతాడు.

అలాంటిది ఆ జట్టు వికెట్‌ను తీయాలంటే ఎంత సాహసం అయినా చేయగలడు. ఈ నేపథ్యంలో అంతకుముందు జరిగిన యాషెస్ సిరీస్ మ్యాచ్‌లో వరుస వికెట్లు తీశాడు. ఇప్పుడు దేశవాళీ టోర్నమెంట్‌లో ఓ అద్బుతమైన రనౌట్‌తో ఇంగ్లండ్‌ జట్టును మళ్లీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు దూరంగా ఉంటున్న జాన్సన్‌.. ఆసీస్‌ దేశవాళీ లీగ్‌ మ్యాచ్‌లలో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లండ్‌ లయన్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జాన్సన్‌ బౌండరీ లైన్‌ వద్ద నుంచే త్రో విసిరి వికెట్లను పడగొట్టాడు. బంతిని నాన్‌ స్టైకర్‌ వైపు విసిరాడు. అది కాస్త వికెట్లను తాకడంతో డామ్‌ బెస్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. ప్రస్తుతం జాన్సన్‌ విసిరిన త్రో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యాద్ధృచ్చికమైన పరిణామానికి అందరితో పాటు మిచెల్ జాన్సన్ కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 15:22 [IST]
Other articles published on Dec 15, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+