Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్‌లో డే నైట్ టెస్టు: ఎందుకంత భయం?

హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరిస్‌లో ఒక టెస్టును డే నెైట్ టెస్టుగా నిర్వహించాలన్న ఆస్ట్రేలియా నిర్ణయాన్ని ఆ దేశ మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ తీవ్రంగా తప్పుబట్టాడు. యాషెస్ సిరిస్‌లో ప్రయోగాలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు.

2016-17లో యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో తొలి డే నైట్ నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిచెల్ జాన్సన్ మీడియాతో మాట్లాడాడు. పింక్ బాల్ మ్యాచ్ భిన్నంగా ఉంటుందని, అందుచేత యాషెస్‌లో డే నైట్ మ్యాచ్ అవసరం లేదని పేర్కొన్నాడు.

Mitchell Johnson Slams Day-Night Ashes Test

క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం తనను ఎంతో నిరుత్సాహానికి గురి చేసిందని తెలిపాడు. 'సాధారణంగా అడిలైడ్ టెస్టులో గ్రాస్ అనేది ఉండదు. గతంలో జరిగిన డే నైట్ టెస్టులో అడిలైడ్‌‌లో చాలా ఎక్కువ మోతాదులో పచ్చదనం చూశాం. ఈ రకంగా ఉండటం బౌలర్లదే పైచేయి అవుతుంది. ఒక బౌలర్‌గా నేను సంతోషంగా ఉండాలి. కానీ మ్యాచ్ గణాంకాలు ఒక్కసారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ పద్ధతిని నేను ఇష్టపడను' అని జాన్సన్ తెలిపాడు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న యాషెస్ సిరీస్ షెడ్యూల్‌ను గత మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసింది. ఐదు టెస్ట్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 2న మొదలు కానున్న మ్యాచ్‌లో పిక్ బాల్‌తో ఆతిథ్య ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.

రెండో టెస్టును అడిలైడ్‌లో పింక్ బాల్ నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అంగీకరించింది. ఇందులో భాగంగా ప్లడ్‌లైట్ల వెలుగులో యాషెస్‌ మ్యాచ్‌ నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి. అంతకంటే ముందు నవంబర్‌ 23-27 మధ్య బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియంలో ఇరు జట్లూ తొలి టెస్టును ఆడతాయి.

Mitchell Johnson Slams Day-Night Ashes Test

అనంతరం పెర్త్, మెల్ బోర్న్, సిడ్నీల్లో మిగతా టెస్టులు షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. అయితే పెర్త్ స్టేడియంలో పునర్నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మూడో టెస్టును నిర్వహించే యోచనను క్రికెట్ ఆస్ట్రేలియా పక్కకు పెట్టే అవకాశం ఉంది. ఆదిశగా అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

గతంలో న్యూజిలాండ్‌తో ఒక డే నైట్ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించారు. అయితే యాషెస్ సిరీస్‌లో మాత్రం ఇదే మొదటిసారి. టెస్టు సిరిస్ అనంతరం ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. 2017 జనవరి 14వ తేదీ నుంచి 28 వరకూ వన్డే సిరీస్‌ను నిర్వహించనున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+