టాంపరింగ్ నిషేదాన్ని పొడిగించాలి: జాన్సన్

బ్రిస్బేన్: ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపిన విషయం బాల్ టాంపరింగ్. స్వయంగా తానే టాంపరింగ్‌కు పాల్పడ్డానంటూ స్టీవ్ స్మిత్ ఒప్పుకున్నాడు. అతనితో పాటు డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్ క్రాఫ్ట్‌లు సైతం బాల్ టాంపరింగ్‌కు కారకులమని ఒప్పుకున్నారు. దీంతో వారిపై ఏడాది పాటు నిషేదం విధించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. మరి కొద్ది నెలల్లో ఈ నిషేదం ముగిసిపోతుండటంతో దానిని ఎత్తివేయొద్దంటూ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కొన్ని రోజులుగా చర్చ తరుణంలో
కొద్ది రోజులుగా ఆస్ట్రేలియా ఆడుతున్న ఒక్క సిరీస్‌లోనూ విజయం దక్కించుకోలేకపోతుంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయిన ఆసీస్ అభిమానులు ఆ ముగ్గురిపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేయాలని కోరుకుంటున్నారు. భారత్‌తో స్వదేశంలో జరగనున్న సిరీస్‌లో ఆడించాలంటూ పలువురు ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్న తరుణంలో జాన్సన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యాన్ని చోటు చేసుకుంటున్నాయి.
అవసరం లేదని అనుకుంటున్నా
ఆసీస్ జట్టు ఆ ముగ్గురు ఆటగాళ్లను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. దీన్ని వారు అంగీకరిచారు. అలాంటప్పుడు నిషేధం ఎత్తేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానని జాన్సన్ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే విధంగా స్పందించారు.
నిషేధాన్ని ఎత్తేసి సిరీస్‌లో ఆడనిస్తే
వారిపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసి, ఇండియాతో జరగనున్న సిరీస్‌లో ఆడనిస్తే మళ్లీ అదే బాటలో నడిచే అవకాశం ఉంది. నిషేధం పూర్తిగా అమలు చేయాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications