Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరోజు పీటర్సన్‌ నా చేతిలో తన్నులు తినేవాడే: జాన్సన్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ 'రీసైలెంట్' పేరిట ఆటో బయోగ్రఫీని రచించారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా 2009 యాషెస్ సిరిస్‌లో చోటు చేసుకున్న కొన్ని చెడు సంఘటనలను క్లుప్తంగా వివరించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోడ్రన్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో మిచెల్ జాన్సన్ ఒకడు. అయితే 2009లో యాషెస్ సిరిస్‌లో చోటు చేసుకున్న పరిణామాలకు గాను జాన్సన్ ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ని కొట్టేంత పనిచేశాడని ఈ పుస్తకంలో వెల్లడించాడు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా కార్ఢిఫ్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తొలి టెస్టు ఆడేందుకు గాను వార్మప్ చేస్తున్నాయి. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ పదే పదే ఆస్ట్రేలియా ఆటగాళ్లను హేళనగా మాట్లాడంట. దాంతో కోపం తట్టుకోలేని జాన్సన్ పీటర్సన్ పైకి దూసుకెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.

అంతేకాదు అతనితో మాటల యుద్ధానికి కూడా దిగినట్టు, పీటర్సన్‌పై చేయి చేసుకునేంత పని కూడా చేశాడు. ఈ సమయంలో పీటర్సన్ కావాలనే జాన్సన్ వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించాడంట. వీరిద్దరి వివాదంపై అప్పట్లో జాన్సన్ తల్లి వికీ హార్బర్, గర్ల్ ప్రెండ్ జెస్సికా బ్రాటిచ్ కూడా స్పందించారు.

'2009లో ఇంగ్లాండ్‌తో తొలి యాషెస్ టెస్టు మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న సమయంలో మాతో పాటు ఇంగ్లాండ్ జట్టు కూడా ప్రాక్టీస్ చేస్తుంది. దానిలో భాగంలో తమ ఆటగాళ్ల ప్రాక్టీస్ చేసే చోటకు పీటర్సన్ బంతిని హిట్ చేస్తున్నాడు. ఒకసారి మా వైపుకు వచ్చిన బంతిని ఇచ్చి పీటర్సన్ ను ఇక ఇటువైపు కొట్టవద్దని చెప్పా' అని జాన్సన్ తెలిపాడు.

'అయినప్పటికీ పీటర్సన్ వినలేదు. మళ్లీ మళ్లీ కొడుతూనే ఉన్నాడు. ఇక కోపం తట్టుకోలేక ఒక్కసారిగా పీటర్సన్ పైకి దూసుకెళ్లాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. ఆ క్రమంలోనే పీటర్సన్ నోరు జారాడు. ఇక కొట్టకోవడం ఒకటే తరువాయి. ఆ తరుణంలో తన సహచర ఆటగాడు క్లార్క్ ఇద్దరి మధ్యకు దూకి గొడవను సద్దుమణిగేలా చేశాడు' అని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+