Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే చరిత్రలో అరుదైన ఘనతను అందుకున్న మిచెల్ స్టార్క్.. దరిదాపుల్లో ఎవరూ లేరు..!

Mitchel Starc Achieved A Rare Feat Of Fastest 200 Wickets In ODI History

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్ స్టార్క్ వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డ్ నెలకొల్పాడు. వన్డేల్లో 200వికెట్లు తీసిన ఫాస్టెస్ట్ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో ఈ ఘనతను స్టార్క్ అందుకున్నాడు. అతను జింబాబ్వే ప్లేయర్ రియాన్‌ బర్ల్‌ వికెట్‌ పడగొట్టడంతో ఈ రికార్డకు చేరువయ్యాడు. కేవలం 102 మ్యాచ్‌ల్లోనే స్టార్క్ 200 వికెట్లు పడగొట్టడం గమనార్హం. అంతకుముందు పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ సక్లైన్ ముస్తాక్ 104 మ్యాచ్‌ల్లో 200వికెట్లు తీశాడు. ముస్తాక్ రికార్డును ప్రస్తుతం స్టార్క్ బద్ధలు కొట్టాడు. అంతకుముందు వన్డేల్లో అత్యంత వేగంగా 100వికెట్లు పడగొట్టిన పేసర్‌గా కూడా స్టార్క్‌ ఘనత సాధించాడు.

మ్యాచ్‌ల పరంగా, బాల్స్ పరంగా స్టార్క్‌దే అగ్రస్థానం

ఇకపోతే అత్యంత వేగంగా 200వికెట్ల మైలురాయి అందుకున్న ప్లేయర్లను ఓసారి గమనిస్తే.. ఈ లిస్టులో స్టార్క్ (102 మ్యాచ్‌లు) తొలిస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ ముస్తాక్ (104మ్యాచ్‌లు), ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ (112మ్యాచ్‌లు), సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ డొనాల్డ్ (117 మ్యాచ్‌లు), పాక్ మాజీ బౌలర్ యూనుస్ (118మ్యాచ్‌లు) టాప్ 5లిస్టులో ఉన్నారు.

ఇక బాల్స్ పరంగా చూసుకున్న స్టార్క్ (5240 బాల్స్)తో వేగంగా 200వికెట్లు సాధించాడు. అతని తర్వాత సక్లైన్ ముస్తాక్ (5457), బ్రెట్ లీ (5640), వకార్ యూనిస్ (5883), షోయాబ్ అక్తర్ (6102) టాప్ 5లో ఉన్నారు. ఇక ఈ విషయంలో మిచెల్ స్టార్క్‌కు దరిదాపుల్లో ఎవరూ లేరు.

చరిత్ర నెలకొల్పిన జింబాబ్వే

ఇకపోతే ఈ మ్యాచ్ విషయానికొస్తే జింబాబ్వేపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి వన్డే మ్యాచ్ గెలిచి జింబాబ్వే చరిత్ర నెలకొల్పింది. ఇకపోతే మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో ఆరోన్‌ ఫించ్‌ నాయకత్వంలోని ఆసీస్.. జింబాబ్వే మీద వరుసగా 5, 8వికెట్ల తేడాతో గెలుపొందినప్పటికీ.. మూడో వన్డేలో మాత్రం పేలవంగా ఆడి ఓటమిపాలయింది.

టౌన్స్‌విల్లే వేదికగా జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ రియాన్‌ బర్ల్‌ 5వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 141పరుగులకే ఆలౌటైంది. డేవిడ్ వార్నర్ (94 పరుగులు) మినహా మిగతావాళ్లు రాణించలేకపోయారు. ఇక ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్‌ తాడివానాషే మారుమని (35 పరుగులు) కెప్టెన్‌ రెగిస్‌ చకబ్వా (37పరుగులు) రాణించడంతో 7వికెట్ల నస్టానికి 142 పరుగులు చేసి జింబాబ్వే గెలుపొందింది. రియాన్‌ బర్ల్‌ మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మూడో వన్డేలో ఆడిన తుది జట్లు

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

జింబాబ్వే జట్టు : తకుద్జ్వానాషే కైటానో, తడివానాషే మారుమణి, వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, రెగిస్ చకబ్వా (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ బర్ల్, టోనీ మున్యోంగా, బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ న్గరవ, విక్టర్ న్యాయుచి

Story first published: Sunday, September 4, 2022, 8:56 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+