Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Missing this little one: ధోని, జీవా త్రోబాక్ ఫోటోను పోస్ట్ చేసిన హార్దిక్ పాండ్యా

Missing this little one: Hardik Pandya posts throwback photo with MS Dhoni and Ziva

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త్వరలో రాంచీలోని ధోని ఇంటిని సందర్శించనున్నాడా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ అభిమానులు. శనివారం ధోని, అతని కుమార్తె జీవాతో కలిసి ఉన్న పాత ఫోటోని హార్ధిక్ పాండ్యా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా తాను జీవాను మిస్సవుతున్నట్లు హార్దిక్ పాండ్యా కామెంట్ పెట్టాడు. పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫోటోలో ధోని, పాండ్యా చేతులను జీవా పట్టుకుని ఉంది. ఈ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన పాండ్యా "ఈ చిన్నదాన్ని బాగ్ మిస్సవుతున్నా(పెద్ద వ్యక్తి కూడా)" అని కామెంట్ పెట్టాడు.

స్మరించుకుందాం: ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీకి నేటితో ఆరేళ్లు పూర్తి

సోషల్ మీడియాలో ఫోటో వైరల్

సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోని, జీవాలతో కలిసి ఉన్న ఫోటోని పాండ్యా పోస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ ముగ్గురూ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోని కూడా హార్ధిక్ పాండ్యా తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. అందులో జీవా కలర్‌పుల్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్‌ను ధరించింది.

గతంలో స్విమ్మింగ్ పూల్‌ ఫోటో

గతంలో స్విమ్మింగ్ పూల్‌ ఫోటో

ఈ క్రమంలో జీవాకు ధోని స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్పుతుంటే సంతోషంగా కనిపించింది. ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత తొలుత భారత ఆర్మీకి సేవలందించేందుకు గాను ధోని విండిస్ పర్యటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత సొంతగడ్డపై జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేడు.

బంగ్లా సిరిస్‌కు ఎంపిక కాని ధోని

బంగ్లా సిరిస్‌కు ఎంపిక కాని ధోని

నవంబర్ 3 నుంచి బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కూడా ధోనీకి చోటు దక్కలేదు. వచ్చే జనవరిలో ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో సెలక్షన్ కమిటీకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధోని తన ట్రైనింగ్‌ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా జిమ్‌లో ధోని కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ అందుకోవడానికి జార్ఖండ్‌ అండర్‌-23 జట్టుతో కలిసి ధోని ప్రాక్టీస్ చేయనున్నాడు.

పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి శస్త్రచికిత్స

పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి శస్త్రచికిత్స

ఇటీవలే పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే పాండ్యా తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేసి "బేబి స్టెప్... పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి నా ప్రయాణం మొదలైంది. నేను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు" అంటూ కామెంట్ పెట్టాడు.

Story first published: Saturday, November 2, 2019, 15:24 [IST]
Other articles published on Nov 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+