Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీలో పోస్టర్ల కలకలం.. మాజీ క్రికెటర్ గంభీర్ కనబడుటలేదు!!

Missing Posters of Gautam Gambhir Spotted in Delhi for Skipping Pollution Meet

ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ తూర్పు ఢిల్లీ లోక్‌సభా స్థానం నుంచి బీజేపీ తరపున నిలబడి గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో 'గంభీర్‌ కనబడుటలేదు' అని పలు పోస్టర్లు వెలిశాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గంభీర్‌ కనబడుటలేదు అని అర్ధం వచ్చేలా పోస్టర్లను చెట్లకు అంటించారు. అర్బన్ డెవలప్‌మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి గంభీర్ గైర్హాజరు కావడమే ఈ పోస్టర్‌లు వెలువడానికి కారణంగా తెలుస్తోంది.

ఎక్కడైనా చూశారా?:

ఎక్కడైనా చూశారా?:

పోస్టర్‌పై ఇలా రాసి ఉంది.. 'ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని మీరు ఎక్కడైనా చూశారా?. ఇండోర్‌లో జిలేబీ తింటుండగా చివరిసారి చూశాం. అతని కోసం ఢిల్లీ మొత్తం వెతుకుతోంది' అని ఆ పోస్టర్‌లలో రాశారు. చాలా సంఖ్యలో పోస్టర్‌లు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు ఈ పోస్టర్‌ పోటోలను తెగ షేర్ చేస్తున్నారు.

గంభీర్‌ గైర్హాజరు:

గంభీర్‌ గైర్హాజరు:

దీపావళి ముందు నుంచి ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా ఉండడంతో.. పొల్యుషన్‌కు సంబంధించిన అంశంపై అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నవంబర్‌ 15న కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎంపీలు, ప్రభుత్వాధికారులు హాజరుకాకపోవడంతో సమావేశాన్ని రద్దు చేశారు. సమావేశానికి ఎంపీ గంభీర్‌ కూడా రాలేదు.

మండిపడుతున్న ఫాన్స్:

మండిపడుతున్న ఫాన్స్:

అయితే ఈ సమావేశానికి గైర్హాజరైన గంభీర్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అతిషి తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో గిట్టనివారు కొందరు చెట్లకు పోస్టర్‌లు అంటించారు. అతిషితో పాటు నెటిజన్లు సోషల్‌ మీడియాలో గంభీర్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. నువ్ మాత్రం జిలేబీలు, అటుకులు తింటూ ఎంజాయ్‌ చేస్తున్నావా అని మండిపడుతున్నారు.

అల్పాహారం కోసం చక్కర్లు:

అల్పాహారం కోసం చక్కర్లు:

ఇండోర్‌లో జరిగిన భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టెస్టుకు గంభీర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వీవీఎస్‌ లక్ష్మణ్‌, టీవీ ప్రెజంటర్‌ జతిన్‌ సప్రూలు కూడా వ్యాఖ్యాతలుగా ఉన్నారు. మ్యాచ్‌ ఆరంభించడానికి ముందు వీరు ముగ్గురు కలిసి అల్పాహారం స్వీకరించడానికి బయటికి వెళ్లారు. గంభీర్‌ పోహా, జిలేబీలతో ఎంజాయ్ చేసాడు. ఈ పోటోలను లక్ష్మణ్‌ షేర్ చేసాడు. 'కొన్నిసార్లు పోహా కంటే కారంగా.. కొన్సి సార్లు జిలేబీ కంటే తీయగా' ఉంటుంది అని ట్వీట్ చేసాడు.

Story first published: Sunday, November 17, 2019, 18:49 [IST]
Other articles published on Nov 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+