
హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా గతేడాది భారత జట్టు తరపున టెస్టు మ్యాచ్‌లో కరుణ్ నాయర్ పాల్గొన్నాడు. ఈ మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో టెస్ట్ మ్యాచ్‌లో సెహ్వాగ్ చేసిన ట్రిపుల్ సెంచరీ జాబితాలో రెండోవాడిగా చేరాడు. అయినా తనకు నిరాశే మిగిలింది. 2018 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా సెలక్టర్లు ఆటగాళ్ల జాబితాను తయారుచేశారు. అయితే ఆ జాబితాలో తన పేరు ఉంటుందని ఆశపడ్డ కరుణ్ నాయర్‌కు నిరాశే మిగిలింది.
జనవరి 5 నుంచి సఫారీ గడ్డపై భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్లను భారత సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టెస్టు జట్టులో కరుణ్ నాయర్ చోటు లభించలేదు. పైగా రెండు రోజుల క్రితం ప్రకటించిన వన్డే జట్టులోనూ చోటు దక్కలేదు. దీంతో కరుణ్ నాయర్‌కు సెలక్టర్ల నిర్వాకం తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన కరుణ్ నాయర్ 'దక్షిణాఫ్రికా పర్యటనకి నన్ను ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఉన్నాను. కానీ, నా పేరు ఆ జాబితాలో లేకపోవడం చాలా నిరాశకు గురిచేసింది. గత ఏడాది ట్రిఫుల్ సెంచరీ చేశాను. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో కూడా అంతే స్థాయిలో నా ప్రతిభను కనబరుస్తున్నాను. ఈ బ్యాటింగ్ ప్రదర్శనతో నన్ను తిరిగి జట్టులోకి తీసుకుంటారని ఆశించాను' అని అన్నాడు.
'కానీ ఎంపిక కాలేదు. ఆ ప్రభావం నా ఆటపై కూడా పడింది. రంజీల్లో ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నన్ను సఫారీ ఎంపిక చేయని ప్రభావం కనబడింది' అని కరుణ్ నాయర్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.