బహిరంగంగా ప్రపోజ్
ఇక అర్షదీప్ సింగ్ బౌలింగ్ పట్ల ఓ అందాల ముద్దుగుమ్మ ఫిదా అయింది. మిస్ హిమాలయ 2017 విజేత, మోడల్ అయిన ప్రేక్ష రాణా అనే హిమాచల్ బ్యూటీ.. అర్షదీప్ అంటే పిచ్చి అభిమానం పెంచుకుంది. ఎంతలా అంటే ట్విట్టర్ వేదికగా ప్లీజ్ అర్షదీప్ మ్యారీ మీ (ప్లీజ్ అర్ష నన్ను పెళ్లి చేసుకో ) అంటూ ఆమె కోరింది. అంతకుముందు కూడా అర్షను మెచ్చుకుంటూ ఓ పోస్ట్ చేసింది. ఇక ఆమె పోస్టు పట్ల నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే అర్షదీప్ సింగ్‌కు మాత్రం ఈ విషయం తెలిసిందో తెలియలేదో తెలీదు కానీ.. ఈ ముద్దుగుమ్మను చూస్తే అర్ష కూడా లయ తప్పుతాడేమో.
స్టైలిష్ పోజులతో మత్తెక్కించే కళ్లతో
ప్రేక్ష రాణా ఇండియాన్ సోషల్ మీడియా సెలబ్రిటీ. అందాల పోటీ మిస్ హిమాలయ 2017లో విజేతగా నిలిచింది. ఆమె తన విలక్షణమైన కస్ట్యూమ్స్‌తో పాటు స్టైలిష్ పోజులతో ఇన్‌స్టాలో తన ఫోటోలు పోస్టు చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌తో పాటు.. ఆమె యూట్యూబర్ కూడా. ఆమె తన డ్యాన్స్ వీడియోలు, సాంగ్ కవర్ వీడియోలను "ప్రేక్ష రాణా" అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలకు వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన టిక్‌టాక్ ఖాతాలో లిప్ సింక్, డ్యాన్స్ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ ఫేమస్ అయింది. కానీ ఇండియాలో టిక్‌టాక్ నిషేధం తర్వాత, ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో వీడియోలను అప్‌లోడ్ చేయడం ప్రారంభించింది.
క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రేక్ష రాణా వయసు 23ఏళ్లు. ఆమె తన 18ఏళ్ల వయసులో మిస్ హిమాలయ కిరీటాన్ని దక్కించుకుంది. అలాగే లక్ష రూపాయల ప్రైజ్ మనీ అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ యునివర్సిటీలో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ కంప్లీట్ చేసింది. మోడలింగ్ కూడా చేసింది. అమెజాన్ ఇండియా ఫ్యాషన్ మోడల్‌గా కొన్నాళ్లు పనిచేసింది. అయితే ఆమెకు పంజాబ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సెటిల్ కావాలని కోరిక. అందుకోసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తోంది. ఆమె హబీస్‌లలో క్రికెట్ వాచింగ్ ప్రధానమైంది. క్రికెట్ అంటే పిచ్చి అనే చెప్పాలి. అందుకే తరచు క్రికెట్ సంబంధిత పోస్టులు చేస్తుంటుంది.


Click it and Unblock the Notifications












