కెప్టెన్ కూల్: మిస్ దివా 2018 రోషిణి రోల్‌మోడల్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ.... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. అంతేకాదు ఐసీసీ నిర్వహించే మూడు ప్రధాన ట్రోఫీలను(వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన ఏకైక భారత కెప్టెన్ కూడా.

ముంబైలో మిస్ దీవా 2018 ఫినాలే పోటీలు
ఎందరో సహ ఆటగాళ్లకు రోల్‌మోడల్‌గా నిలిచిన ధోనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు‘కెప్టెన్ కూల్'. ధోనికి అటు పురుష అభిమానులతో పాటు మహిళల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. ఆదివారం ముంబైలో మిస్ దీవా 2018 ఫినాలే పోటీలు జరిగాయి.

నీ రోల్ మోడల్ ఎవరు?
ఈ కార్యక్రామనికి బాలీవుడ్ నటులు శిల్పా శెట్టి, మలైకా అరోరా ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రన్నరప్‌గా నిలిచిన రోషిణి షియోరన్‌ను మలైకా ఓ ప్రశ్న అడిగారు. ‘నీ రోల్ మోడల్ ఎవరు? వారిని రోల్ మోడల్‌గా ఎంచుకోవడానికి కారణం ఏంటి?' అని అడిగారు.

ధోని అని చెప్పడంతో ఆశ్చర్యానికి లోనైన జడ్జిలు
అయితే, ఆమె మరో మహిళా సెలబ్రిటీ గురించి చెప్తారేమో? అని అక్కడున్నవారంతా అనుకున్నారు. కానీ, రోషిణి ‘నా రోల్‌మోడల్ మహేంద్ర సింగ్ ధోనీ' అని చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకు అని ఆమెని ప్రశ్నించగా ‘నాకు ధోని ఎందుకిష్టం అంటే.. అతను ‘కెప్టెన్ కూల్'. ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా డీల్ చేస్తారు. రెండో విషయం.. తన జట్టులోని సభ్యులను ఎంతో ప్రోత్సహిస్తారు. టీమ్ వర్క్ అంటే అది. ఇక మూడో విషయం.. ధోనికి సాయం చేసే గుణం ఎక్కువ' అని చెప్పారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముఖంలో సంతోషం
రోషిణి సమాధానం విని అక్కడే ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముఖంలో సంతోషం వెల్లువిరిసింది. ‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంలో హీరోగా నటించింది సుశాంత్ సింగ్ రాజ్‌పుతే కాబట్టి. ఈ కార్యక్రమంలో రోషిణి... ధోని గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications