ఆఖరి ఓవర్‌లో భారత్ చేతిలో ఓటమి: స్కూప్ షాట్‌పై పాక్ మాజీ క్రికెటర్

హైదరాబాద్: సెప్టెంబర్ 24, 2007. జోహెన్స్ బర్గ్ వేదికగా తొలి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి.
ఆదే సమయంలో భారత్ విజయానికి ఒకే ఒక వికెట్ తీయాలి. క్రీజులో మిస్బా ఉల్ హక్ ఉన్నాడు. సీనియర్ ఆటగాడు కావడంతో అందరూ పాక్‌దే విజయమనుకున్నారు. ఈ సమయంలో కెప్టెన్ ధోని తన వ్యూహం మార్చాడు. ఆఖరి ఓవర్ వేయమని జోగిందర్ శర్మకు బంతిని అందించాడు.

భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా
జోగిందర్ వేసిన రెండో బంతిని మిస్బా సిక్స్ బాదాడు. ఈ దెబ్బతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. పాక్ విజయానికి ఇంకా నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. జోగిందర్ మూడో బంతిని వేశాడు. మిస్బా స్కూప్ షాట్‌కు ప్రయత్నించి ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు.

భారత శిబిరంలో వెల్లువిరిసిన ఆనందం
ఆ బంతి గాల్లోకి ఎగిరి శ్రీశాంత్ చేతిలో పడింది. భారత శిబిరంలో ఒక్కసారి ఆనందం వెల్లువిరిసింది. సఫారీ గడ్డపై నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించడంతో అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.

మిస్బా స్కూల్ షాట్‌పై అభిమానులు
స్కూప్ షాట్ ఆడిన మిస్బాను మాత్రం పాక్ అభిమానులు ఎన్నటికీ మరచిపోలేరు. ఆ మ్యాచ్‌లో మిస్బా స్కూప్ షాట్ ఆడటం వల్లే పాక్ ఓటమి పాలైందని అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఈ షాట్‌పై న్యూస్‌వన్.టీవికి ఇచ్చిన ఇంటర్యూలో మిస్బా ఉల్ హక్ స్పందించాడు.
ఎటువంటి బాధ లేదన్న మిస్బా
'ఆ రోజు అలా ఆడినందుకు తనకు ఎటువంటి బాధ లేదన్నాడు. దాని గురించి తాను చింతించడం లేదు' అని తేల్చి చెప్పాడు. అయితే, ఆ బాధ తనను చాలా రోజులు వేధించిందని, ఆ తర్వాత క్రమంగా దాని నుంచి బయటపడ్డానని పేర్కొన్నాడు. ప్రస్తుత క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమ కెప్టెన్ అని మిస్బా కొనియాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications