For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన ఘనతని సాధించిన పాక్ కెప్టెన్ మిస్బా

By Nageshwara Rao

లాహోర్: పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్‌ హక్‌ అరుదైన ఘనతను సాధించాడు. పాక్ తరుపున ఇప్పటివరకు అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా నాయకత్వం వహించిన ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును మిస్బావుల్‌ హక్‌ అధిగమించాడు. 1982-1992 కాలంలో పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్‌ ఖాన్‌ 48 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2010లో పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను స్వీకరించిన మిస్బావుల్‌ హక్‌ 48 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజాగా వెస్టిండిస్‌తో ఆదివారం షార్జాలో ప్రారంభమైన మూడో టెస్టు మిస్బావుల్‌ హక్‌ కెప్టెన్సీ జరుగుతున్న 49వ టెస్టు. దీంతో మిస్బావుల్‌ హక్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

మిస్బావుల్‌ పాకిస్ధాన్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి టెస్టుల్లో పాక్ ఆరో స్ధానంలో ఉంది. మిస్బావుల్‌ కెప్టెన్సీలో పాకిస్థాన్ 24 టెస్టుల్లో విజయం సాధించగా, 13 టెస్టుల్లో ఓటమి పాలైంది. 11 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. కాగా 1982 నుంచి 1992 మధ్య కాలంలో ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో పాకిస్థాన్‌ 14 టెస్టుల్లో విజయం సాధించగా, 8 ఓటమి, 26 డ్రాగా ముగించింది.

Misbah-ul-Haq becomes country's most-capped Test captain

ఈ అరుదైన రికార్డు గురించి మిస్బావుల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త రికార్డులు అందుకున్నప్పుడు సంతోషంగానే ఉంటుందని పేర్కొన్నాడు. కాని తన మొదటి ప్రాధాన్యత జట్టు విజయమేనని, ప్రతి టెస్టు తనకెంతో ముఖ్యమని తెలిపాడు.

గత మ్యాచ్ కంటే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి జట్టు గెలవాలని కోరుకుంటానని పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం పాకిస్థాన్, వెస్టిండిస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మూడో టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే రెండు టెస్టుల్లో పాక్ విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+