ఎంతో బాధగా ఉంది: టెస్టు క్రికెట్‌కు మిస్బా వీడ్కోలు
హైదరాబాద్: పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో వెస్టిండీస్ తో జరిగే టెస్టు సిరీస్ తనకు చివరిదని మిస్బా తెలిపాడు. ఈ మేరకు గురువారం తన క్రికెట్ కెరీర్‌పై ఓ ప్రకటన చేశాడు.

ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిడి లేదు
వీడ్కోలు తీసుకునే విషయంలో ఎవరి నుంచి ఎటువంటి ఒత్తిడి లేదని మిస్బా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో వద్ద విలేకరులకు తెలిపారు. 'వెస్టిండిస్‌తో సిరీస్ నాకు ఆఖరిది. ఈ విషయాన్ని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్‌కు ఇప్పటికే తెలియజేశా. నా చివరి సిరీస్‌ను విజయవంతంగా ముగించాలని అనుకుంటున్నా. దాని కోసం యత్నిస్తా. నాపై ఎటువంటి ఒత్తిడి లేదు' అని మిస్బా అన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతా
అయితే దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతానని మిస్పా స్పష్టం చేశాడు. 53 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా మిస్బా వ్యవహరించాడు. అందులో 24 విజయాలు, 11 డ్రాలు, 18 ఓటములు ఉన్నాయి. ఈ నెల 21న పాకిస్థాన్-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ తరువాత మిస్బా తన కెరీర్‌కు గుడ్ బై చెప్పనున్నాడు.

ఎంతో ఆనందంగా గడిచింది
క్రికెటర్‌గా తన జీవితం ఎంతో ఆనందంగా గడిచిందని మిస్బా తెలిపాడు. గతేడాది పాకిస్థాన్ జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిందని.. భద్రత సమస్యల కారణంగా సొంతగడ్డపై క్రికెట్ ఆడలేకపోవడం బాధగా ఉందని మిస్బా అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో తమ జట్టు పుంజుకుని గత వైభవాన్ని చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను నియమించాలని చూస్తున్న పీసీబీ.. అందులో భాగంగా మిస్బాపై ఒత్తిడి తెచ్చింది. ఇక పాకిస్తాన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చైర్మన్ షహర్యార్ తేల్చిచెప్పడంతో మిస్బా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications