అద్దం లేకుంటేనా: భార్యకు హాట్ కిస్: కెమెరా కంటికి చిక్కిన ముంబై ఇండియన్స్ బ్యాక్‌బోన్

MIs Suryakumar Yadav was spotted kissing his wife Devisha Shetty
IPL 2021 : Suryakumar Kisses Wife Devisha Through A Glass, Fans Go Crazy || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ మరో ఛాంపియన్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పటికే అయిదు సార్లు టైటిల్‌ను ఎగురేసుకెళ్లిన రోహిత్ శర్మ టీమ్.. మరోసారి కప్‌పై కన్నేసింది. ఆరంభంలో తడిపడినప్పటికీ.. క్రమంగా పుంజుకుంటోంది. వరుసగా రెండో మ్యాచుల్లో ఎదురైన ఓటమిని అధిగమించి.. రాజస్థాన్ రాయల్స్‌పై రాయల్‌గా గెలిచింది. ఆరు మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్.. మూడింట్లో గెలిచింది.

మొత్తం ఆరు పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. చివరి రెండు మ్యాచుల్లో ఓటమి అనంతరం డీలా పడినట్టుగా కనిపించిన ముంబై జట్టుకు.. తనకంటే బలహీనమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టడం లాభించింది. బ్యాటింగ్, బౌలింగ్ వనరులు పెద్దగా లేని రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌తో తన ఆటతీరును రిథమ్‌లోకి తెచ్చుకోగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్‌ను 18.3 ఓవర్లలోనే అందుకుంది.

దీనికోసం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ దుమ్ములేపాడీ మ్యాచ్‌లో. 50 బంతుల్లో 70 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు. ఉన్నంత సేపూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ట్రేడ్‌మార్క్ షాట్లతో చెలరేగాడు. 10 బంతుల్లో మూడుఫోర్లతో 16 పరుగులు చేశాడు. క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం స్టాండ్స్‌లో భార్య దేవిషా షెట్టితో దొరికాడు.. సూర్యకుమార్ యాదవ్. తన భార్యకు హాట్ హాట్‌గా ఓ కిస్ ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు. అద్దానికి అటు వైపున ఉన్న దేవిషా షెట్టి చిక్స్ మీద ముద్దు పెడుతూ కనిపించాడు. దేవిషా షెట్టి ఆ గ్లాస్‌కు తన చెంపను ఆనించి నిల్చోగా.. అటు వైపున్న సూర్యకుమార్ యాదవ్ కిస్ చేయడం కనిపించింది. అక్కడున్న ఫొటోగ్రాఫర్లు ఆ సీన్‌ను క్లిక్‌మనిపించారు.

ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఫొటోపై తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆడిన ఆరు మ్యాచుల్లో సూర్యకుమార్ యాదవ్ 170 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ సీజన్‌లో అతని బెస్ట్ బ్యాటింగ్ ఫిగర్ 56. బ్యాటింగ్ యావరేజ్ 28.33. 145.29 స్ట్రైక్‌రేట్ను నమోదు చేశాడతను. ఇంగ్లాండ్‌పై జరిగిన సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో ఆడాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 30, 2021, 12:19 [IST]
Other articles published on Apr 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X