క్రికెట్ అభిమానులకు వరుస షాకులు: ధోనీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన రైనా

క్రికెట్ వీరాభిమానులకు టీమ్ ఇండియా క్రికెటర్లు వరుస షాకులిచ్చారు. ముందుగా సోషల్ మీడియా వేదికగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగానే మరో కీలక ఆటగాడు సురేష్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ధోనీతో ఆడటం తనకెంతో సంతోషంగా ఉందని ఇన్స్‌టాగ్రామ్ వేదికగా చెప్పిన సురేష్ రైనా ధోనీ ప్రయాణంలో తాను కూడా తోడుగా ఉండదలచుకున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
2005లో శ్రీలంకపై తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రైనా.. చివరి వన్డేను ఇంగ్లాడ్‌పై జూలై 2018లో ఆడాడు. ఇక 2010లో శ్రీలంకపై తొలి టెస్టు ఆడాడు. ఇక 2006లో సౌతాఫ్రికాపై తొలి టీట్వంటీ మ్యాచ్ ఆడాడు. ఇప్పటి వరకు 226 వన్డే మ్యాచ్‌లు ఆడిన రైనా.. 5615 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా 36 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టెస్టు గణాంకాలకు వస్తే... 18 మ్యాచులు ఆడిన రైనా.. ఒక సెంచరీ ఏడు అర్థ సెంచరీలతో మొత్తం 768 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications