Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్ షమీకి మద్దతుగా కేంద్ర స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్.. అది భారతీయుడి లక్షణం

Minister Anurag Thakur Supported Shami, and he Says Festival are for Uniting us not for parting us

భారత క్రికెటర్ షమీని ట్రోల్ చేయడంపై నెటిజన్ల పట్ల కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. అక్టోబర్ 5న దసరా సందర్భంగా మహ్మద్ షమీని లక్ష్యంగా చేసుకుని ట్రోలర్స్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ హ్యాండిల్ వేదికగా.. షమీ తన అభిమానులకు, ఫాలోవర్లకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. ముస్లిం అయిన షమీ దసరా శుభాకాంక్షలు చెప్పడమేంటని మహ్మద్ షమీని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. హిందువుల పండుగకు శుభాకాంక్షలు చెప్పడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు.

ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయమై మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. దసరా జరుపుకోవడంలో ఎలాంటి తప్పులేదని, పండుగల విషయంలో మనం కులం, మతం అని విడిపోకుండా అందరం ఒకే దేశీయులమనే భావనతో జరుపుకోవడం చాలా ముఖ్యమని అనురాగ్ అన్నారు. ప్రతి భారతీయ క్రికెటర్, క్రికెట్ ఆరాధించే వారందరూ ఈ పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు.

వ్యతిరేకించే వాళ్లు విభజన కోరుకునేవారు

వ్యతిరేకించే వాళ్లు విభజన కోరుకునేవారు

'దసరా అంటే అందరూ జరుపుకునే పండుగ.. భారత క్రికెటర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. మహ్మద్ షమీ కూడా జరుపుకుంటే సమస్య ఏంటి?.. వ్యతిరేకించే వాళ్లే దేశ విభజనను కోరుకునేవాళ్లు. కానీ నిజమైన భారతీయులు ప్రతి పండగను ఆరాధించాలి, గౌరవించాలి. తద్వారా ఇదంత మనదేశం అనే భావనను తీసుకురావాలి. ప్రతి మతస్థుడు అన్ని పండుగలను జరుపుకోవాలి' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

షమీ పాపానికి ఒడిగట్టాడంటూ రభస

షమీ పాపానికి ఒడిగట్టాడంటూ రభస

షమీ దసరా శుభాకాంక్షలు తెలపడం పట్ల నెటిజన్లు అతని మీద చాలా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు దసరా శుభాకాంక్షలు పంచుకోవడం పాపమంటూ షమీ పాపానికి ఒడిగట్టాడంటూ ఓ నెటిజన్ మండిపడ్డాడు. మరో నెటిజన్.. భారత క్రికెట్ జట్టులో చోటు కల్పించడానికి ఈ సందర్భాన్ని షమీ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడని ఆరోపించారు. షమీ మతానికి విరుద్ధమైన ప్రకటనతో ఆశ్చర్యపరిచాడని, అతనిపై ఫత్వా విధించాలంటూ ఖండించారు. మరొకరు 'షమీ నీ గురించి తలుచుకుంటే షేమ్ అనిపిస్తుంది. నువ్వు రాముడికి విశ్వాసివా' అంటూ మండిపడ్డాడు.

షమీని సమర్థిస్తూ కొందరు నెటిజన్ల పోస్టులు

ఇక మరికొందరు మాత్రం షమీ చేసింది ముమ్మాటికీ సరైన పనే అని పేర్కొన్నారు. ముందు మనందరం భారతీయులం ఆ తర్వాతే మతం అనే విషయాన్ని గుర్తుంచుకుని సోదరభావంతో ఇరు మతాల సంప్రదాయాలు గౌరవించడమే అసలైన భారతీయుడి లక్షణం అంటూ షమీకి మద్దతు పలికారు. షమీ ఏ మతానికి చెందినవాడు కాదు.. ప్రతి భారతీయుడు ఆరాధించే క్రికెట్ అనే మతానికి చెందినవాడు.. అంటూ షమీ ప్రొఫెషన్‌ను కొందరు హైలెట్ చేశారు.

ఇంకొందరు విడదీసే పలుకులతో మీరు షమీ మనస్సును ఏమార్చలేరు.. పండుగకు శుభాకాంక్షలు చెప్పేది సర్వసాధారణమైన లక్షణం.. అది షమీ కాదు ప్రపంచంలోని ఏ ముస్లిం నేత చేసిన తప్పే కాదు అంటూ ఇంకొందరు పేర్కొంటున్నారు.

Story first published: Saturday, October 8, 2022, 12:55 [IST]
Other articles published on Oct 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+