For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మనసు, గుండె ఇప్పటికీ కాశ్మీర్‌లోనే: ఇర్ఫాన్ పఠాన్

‘Mind & Heart still in Kashmir,’ says Irfan Pathan after being asked to leave the state at the earliest

హైదరాబాద్: తన మనసు, గుండె కాశ్మీర్‌లోని భారత ఆర్మీ... కాశ్మీర్ బ్రదర్స్, సిస్టర్స్‌ చుట్టూ తిరుగుతోందని టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలని ఇర్ఫాన్ పఠాన్‌తోపాటు మరో 100 మంది క్రికెటర్లకు జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) సూచించిన సంగతి తెలిసిందే.

కాగా, ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం జమ్ము అండ్ కాశ్మీర్ జట్టు క్రీడాకారుడిగా, మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇర్ఫాన్ పఠాన్ స్వస్థలం గుజరాత్. దీంతో ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు సేవలందిస్తోన్న మిగతా రాష్ట్రయేతరులను అందరినీ రాష్ట్రం విడిచి వెళ్లాలని జేకేసీఏ సూచించింది.

జేకేసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ

జేకేసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ

దీనిపై జేకేసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయ్యద్ ఆసికీ హుస్సేన్ బుఖారీ మాట్లాడుతూ "అవును, ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌ని జమ్మూ అండ్ కాశ్మర్‌ని వదిలి వెళ్లమని జేకేసీఏ సూచించింది. ఆదివారమే వారు కాశ్మీర్ వ్యాలీ వదిలి వెళ్లారు. ఈ ప్రాంతానికి సంబంధం లేని సెలక్టర్లను సైతం వారి స్వస్థలాలకు వెళ్లిమని ఆదేశించాం" అని ఆయన తెలిపారు.

పర్వేజ్ రసూల్ మాట్లాడుతూ

పర్వేజ్ రసూల్ మాట్లాడుతూ

ఇక, జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెటర్ పర్వేజ్ రసూల్ మాట్లాడుతూ "యువ క్రికెటర్ల ఎంపిక కోసం కొన్ని మ్యాచ్‌లు నిర్వహించాలని భావించాం. ఇందులో భాగంగా అండర్-19, అండర్-16 క్రీడాకారులతోపాటు సీనియర్ క్రీడాకారులు కూడా షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో బస చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేశాం. స్టేడియంలో ఉన్న వారిని స్వస్థలాలకు పంపుతున్నాం" అని అన్నారు.

ఆర్టికల్ 370ను రద్దు

ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి

అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడక ముందు మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి.

ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు

జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను వెనువెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. మరోవైపు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 7వ తేదీన ప్రకటన చేయనున్నారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా పీడీపీ సభ్యులు రాజ్యసభలో చొక్కాలు చించుకుని నిరసన వ్యక్తం చేశారు.

Story first published: Monday, August 5, 2019, 13:26 [IST]
Other articles published on Aug 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+