Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మైదానాన్ని వీడిన మహామహుడు.. స్టార్ క్రికెటర్ కన్నుమూత!

క్రికెట్, రగ్బీ వంటి రెండు భిన్నమైన క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ ఆటగాడు. మాజీ కెప్టెన్ మైక్ స్మిత్(92) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను వారిక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ధ్రువీకరించింది. గ్లామోర్గాన్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ప్లేయర్లు, అధికారులు మైక్ స్మిత్‌కు నివాళులర్పిస్తూ ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. 1950, 60ల కాలంలో ఇంగ్లాండ్ క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన ఆయన మృతి పట్ల క్రీడా ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.

మైక్ స్మిత్ తన సుదీర్ఘ కెరీర్లో ఇంగ్లాండ్ తరఫున 50 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 1958 నుంచి 1972 మధ్య కాలంలో మైక్ స్మిత్ ఏకంగా 25 టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోగా.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. టెస్ట్ క్రికెట్లో మైక్ స్మిత్ 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో మొత్తం 2,278 పరుగులు చేశాడు. క్రీడా రంగానికి మైక్ స్మిత్ చేసిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా 1976లో బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను 'ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' గౌరవంతో సత్కరించింది.

Mike Smith Passes Away Former England Cricket Captain and Rugby Player Dies at 92 Full Details

టెస్ట్ క్రికెట్లోనే కాకుండా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో మైక్ స్మిత్ అసాధారణమైన రికార్డులను సృష్టించాడు. 1957 నుంచి 1967 మధ్య కాలంలో ఆయన వారిక్‌‌షైర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన మొత్తం ఫస్ట్-క్లాస్ కెరీర్లో 637 మ్యాచ్‌లు ఆడిన మైక్ స్మిత్.. దాదాపు 40 వేల పరుగులు(39,832 పరుగులు) సాధించి రికార్డు సృష్టించాడు. వారిక్‌షైర్ క్లబ్‌లో చేరడానికి ముందు ఆయన లీసెస్టర్‌షైర్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ జట్లకు కూడా ఆడాడు. వీటితో పాటు లిస్ట్-ఎ క్రికెట్లో కూడా మైక్ స్మిత్ పేరిట 3,106 పరుగులు ఉన్నాయి.

మైక్ స్మిత్ కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా, రగ్బీ క్రీడలోనూ అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా రాణించడం విశేషం. 1956లో వేల్స్ జట్టుతో జరిగిన అంతర్జాతీయ రగ్బీ యూనియన్ మ్యాచ్‌లో ఆయన ఇంగ్లాండ్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఇలా రెండు వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన కొద్దిమంది ప్లేయర్లలో మైక్ స్మిత్ ఒకరిగా నిలిచాడు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఆయన ఐసీసీ మ్యాచ్ రెఫరీగా కూడా సేవలందించాడు.

1958లో న్యూజిలాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన మైక్ స్మిత్.. కెరీర్ ప్రారంభంలో ఓపెనర్‌గా వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో స్థిరపడి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 1959లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్‌పై ఆయన తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత 1963-64లో టెడ్ డెక్స్టర్, కాలిన్ కౌడ్రీ వంటి ప్రముఖ ఆటగాళ్లు అందుబాటులో లేని సమయంలో ఆయనకు భారత పర్యటనలో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. మైక్ స్మిత్ మరణం ఇంగ్లాండ్ క్రీడారంగానికి తీరని లోటుగా నిలిచింది.

Story first published: Tuesday, May 19, 2026, 8:58 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+