Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'WTC Final వారిద్దరి కెప్టెన్సీకి ఓ పరీక్ష.. టీమిండియా టాప్‌ ఆర్డరే మ్యాచ్ ఫలితాన్ని తేల్చేది'

Mike Hesson says WTC final will be a test of captaincy for Virat Kohli and Kane Williamson
India’s Top Order VS Swinging Ball - Mike Hesson| WTC Final | Oneindia Telugu

హైదరాబాద్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌లు.. ఏ విధంగా తమ జట్లను ముందుండి నడిపిస్తారనేది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుందని కివీస్‌ మాజీ హెడ్ కోచ్‌ మైక్‌ హెసన్ అన్నారు. కెప్టెన్సీలో ఇద్దరిది భిన్నమైన శైలి అని, తమ మార్క్ సారథ్యంతో ఇద్దరూ ఆకట్టుకుంటారన్నారు.

న్యూజిలాండ్‌ బౌలర్లను భారత టాప్‌ఆర్డర్‌ ఎలా ఎదుర్కొంటారనేదానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుందని హెసన్ పేర్కొన్నారు. భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రారంభం కానుంది.

ఇద్దరిది భిన్నమైన శైలి

ఇద్దరిది భిన్నమైన శైలి

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ మైక్‌ హెసన్ ఓ ఇంటర్వ్యూలో విరాట్‌ కోహ్లీ, విలియమ్సన్‌ల కెప్టెన్సీ గురించి స్పందించాడు. 'కోహ్లీ-కేన్ చాలా మంచి కెప్టెన్‌లు. కెప్టెన్సీలో ఇద్దరిది భిన్నమైన శైలి. జట్టులోని ఆటగాళ్లు వారిని నిత్యం అనుసరించాలనుకుంటున్నారు. ఇది ఏ కెప్టెన్‌కైనా గొప్ప గుర్తింపు. విలియమ్సన్‌ ఓపికతో ఉంటూ నిర్ణీత సమయంలో ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తాడు. కోహ్లీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రత్యర్థిపై నిరంతరం ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ క్రమంలో సక్సెస్ అవుతాడు' అని హెసన్‌ పేర్కొన్నారు.

టాప్‌ ఆర్డరే మ్యాచ్ ఫలితాన్ని తేల్చేది

టాప్‌ ఆర్డరే మ్యాచ్ ఫలితాన్ని తేల్చేది

'డబ్ల్యూటీసీ ఫైనల్‌ కేన్ విలియమ్సన్‌, విరాట్‌ కోహ్లీల కెప్టెన్సీకి పరీక్ష లాంటిది. రోజు రోజుకూ పిచ్‌ పరిస్థితులు మారుతున్నప్పడు వారు తమ వ్యూహాలలో చిన్న చిన్న సర్దుబాట్లు చేస్తూ ఎలా ముందుకు వెళతారనే ఆసక్తికరంగా ఉంటుంది. భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్.. న్యూజిలాండ్‌ బౌలర్ల స్వింగ్‌ బంతులను ఎలా ఎదుర్కొంటారో చూడాలని ఉత్సుకతతో ఉన్నా. న్యూజిలాండ్‌ బౌలర్లను టీమిండియా టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. అదే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయించొచ్చు' అని మైక్‌ హెసన్‌ అన్నారు.

ప్రాక్టీస్‌లో కోహ్లీసేన

ప్రాక్టీస్‌లో కోహ్లీసేన

ఫైనల్ జూన్‌ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కఠిన క్వారంటైన్‌ శనివారం ముగియడంతో.. ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్‌ సెషన్‌ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్లేయర్స్ కఠిన సాధన చేశారు. సాధనకు సంబందించిన పోటోలను పలువురు ఇండియన్ ప్లేయర్స్ తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేశారు.

ఇంగ్లండ్‌తో కివీస్ టెస్ట్ సిరీస్

ఇంగ్లండ్‌తో కివీస్ టెస్ట్ సిరీస్

గత నెలలోనే ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్‌.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో తలపడింది. బ్యాట్స్‌మన్‌, బౌలర్లు సత్తాచాటడంతో మ్యాచును డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌ తర్వాత ఇరు జట్లు జూన్ 10న రెండో టెస్ట్‌లో తలపడతాయి. దీంతో ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు కావాల్సిన ప్రాక్టీస్‌ లభించినట్లవుతుంది. మరోవైపు టీమిండియా ఇప్పుడే ప్రాక్టీస్ ఆరంభించింది. డబ్యూటీసీ ఫైనల్‌ ముగిసాక 42 రోజుల పాటు కోహ్లీసేన ఖాళీగా ఉంటుంది. అనంతరం ఆగస్టు​ 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తలపడనుంది.

Story first published: Monday, June 7, 2021, 12:41 [IST]
Other articles published on Jun 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+