2019 T20 Blast: కౌంటీల్లో డివిలియర్స్, తొలి మ్యాచ్ లార్డ్స్‌లో!

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. టీ20 బ్లాస్ట్ టోర్నీ కోసం డివిలియర్స్ మిడిలెసెక్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా ఏబీ డివిలియర్స్ ఈ సీజన్ మొదటి ఏడు రౌండ్లకు జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. టీ20 బ్లాస్ట్ టోర్నీ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో మిడిలెసెక్స్ జట్టు ఎసెక్స్ జట్టుతో తలపడనుంది.

ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుపున
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఏబీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23న ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.

తొలి రెండు వారాల షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు.
ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ
టీ20 బ్లాస్ట్ టోర్నీ కోసం మిడిలెసెక్స్ జట్టుతో ఒప్పందం చేసుకోవడంపై ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ "కౌంటీ క్రికెట్ ఆడాలని నేనెప్పుడూ అనుకుంటా. మిడిలెసెక్స్ జట్టుతో చేరడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. లార్డ్స్ మైదానంలో ఆడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది" అని అన్నాడు.

కోచ్ స్టువర్ట్ లా మాట్లాడుతూ
ఆ జట్టు కోచ్ స్టువర్ట్ లా మాట్లాడుతూ "ఏబీ మాతో ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడైన అతడిని చూసి నేర్చుకోవడానికి యువ క్రికెటర్లకు మంచి అవకాశం" అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications