Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు క్రికెట్‌తో కంప్యూటర్‌కి లింక్ పెట్టిన సత్య నాదెళ్ల

హైదరాబాద్: కంప్యూటర్‌కు టెస్టు క్రికెట్‌కు ఉన్న గొప్పతనాన్ని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అద్భుతమైన రీతిలో వివరించారు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో తనకు టెస్టులంటేనే ఎక్కువ ఇష్టమని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. అంతేకాదు టెస్టు క్రికెట్ ఎప్పటికీ నిలిచి ఉండాలని, ఆ ఫార్మెట్‌లో ఉండే అందం వేరని ఆయన చెప్పుకొచ్చారు.

 కంప్యూటర్ నుంచి సృజనాత్మకత పుడుతుంది

కంప్యూటర్ నుంచి సృజనాత్మకత పుడుతుంది

మంగళవారం సియోటెల్‌లో గీక్ వైర్ సమ్మిట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్య నాదెళ్ల మాట్లాడుతూ 'గత ఏడాది కాలంలో 30 కోట్ల కంప్యూటర్లు అమ్ముడయ్యాయి. అదే కాలంలో 100 కోట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయి. కానీ కంప్యూటరే గొప్ప. కంప్యూటర్ నుంచి సృజనాత్మకత పుడుతుంది' అని ఆయన అన్నారు.

 టెస్టు క్రికెట్ కనుమరుగైతే కష్టమే

టెస్టు క్రికెట్ కనుమరుగైతే కష్టమే

టెస్టు క్రికెట్‌ కూడా ఇలాంటిదేనని, టెస్టు క్రికెట్‌కు మళ్లీ ఒకప్పటి స్థాయిలో ఆదరణ పెంచడానికి ప్రయత్నించాలని అన్నారు. టెస్టు క్రికెట్ కనుమరుగైతే తనలాంటి అభిమానులు ఎంతో మంది అసంతృప్తికి గురవుతారని సత్య నాదెళ్ల అన్నారు. చిన్నతం నుంచే తనకు క్రికెట్ అంటే ఎంతో ఆసక్తిని అని తెలిపారు.

 చిన్నతనంలో కొన్ని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూశా

చిన్నతనంలో కొన్ని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూశా

తన చిన్నతనంలో హైదరాబాద్‌-ముంబై జట్ల మధ్య ఓ ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భారత జట్టులోకి వచ్చే సమయానికి తాను అమెరికాకు వెళ్లిపోవడంతో అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను నేరుగా చూసే అవకాశం కోల్పోయానని చెప్పారు.

2011 వరల్డ్ కప్‌లో ధోని కొట్టిన సిక్సర్ ఇప్పటికీ జ్ఞాపకమే

2011 వరల్డ్ కప్‌లో ధోని కొట్టిన సిక్సర్ ఇప్పటికీ జ్ఞాపకమే

ఇక, భారత క్రికెట్ టెస్టు చరిత్రలోనే 2001 ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మరో గొప్ప మలుపు అని, ఆ మ్యాచ్‌లో లక్ష్మణ్‌- రాహుల్ ద్రవిడ్‌‌లు అద్భుత ప్రదర్శన చేశారని తెలిపారు. అదేవిధంగా 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో ధోని కొట్టిన సిక్సర్‌ కూడా ఎప్పటికీ మరపురాని జ్ఞాపకమని సత్య నాదెళ్ల చెప్పుకొచ్చారు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+