
హైదరాబాద్: టెస్టు క్రికెట్‌కు పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఏ మాత్రం ఆశ్చర్యానికి గురి చేయలేదని ఆ జట్టు హెడ్ కోచ్ మికీ ఆర్ధర్ అన్నాడు. 27 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెస్టులకు మహ్మద్ ఆమీర్ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ కమ్యూనిటీని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హెడ్ కోచ్ మికీ ఆర్థర్ మాట్లాడుతూ "అతడు(ఆమీర్) ఐదేళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ ఐదేళ్లు అతడు ఏం చేయలేదు. ఈ సమయంలో అతడి శరీరం టెస్టు క్రికెట్‌కు అనకూలంగా లేదు. అతడు మంచి బౌలర్ కాబట్టి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరిస్‌లకు మేమే అతడిని ముందుకు నెట్టాం" అని చెప్పుకొచ్చాడు.
"ఆమీర్‌తో చేయగలిగిన ప్రతిదాన్ని మేము ప్రయత్నించాం. అతడు ఆ ఐదేళ్ళు బాగా మేనేజ్ చేశాడు. దానిని అంగీకరించిన మొదటి వ్యక్తి అతడే. ఆ తర్వాత అతడు తన మొత్తం జీవితంలో ఎక్కడ ఉన్నాడో నాకు అర్థమైంది, కాబట్టి ఇది అతనికి కఠినమైన కాలం. నేను అన్నీ అర్థం చేసుకున్నాను" అని పాక్ కోచ్ మికీ ఆర్థర్ అన్నాడు.
2009, జులైలో గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమీర్ పాక్ తరుపున మొత్తం 36 టెస్టులాడాడు. 17 ఏళ్ల వయసులో టెస్టు అరంగేట్రం చేసిన ఆమీర్ 30.47 యావరేజితో మొత్తం 119 వికెట్లు తీశాడు. 2010లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆమిర్ కెరీర్ ప్రమాదంలో పడింది.
ఫిక్సింగ్‌లో దోషిగా తేలడంతో అతడు 2010 నుంచి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. కొంతకాలం జైలు జీవితాన్ని కూడా గడిపాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ ఇంగ్లాండ్‌లో సెటిల్ అవుతున్నాడనే వార్తలు వచ్చాయి.
కాగా, బ్రిటీష్ పౌరసత్వం కల్గిన నర్గీస్ మాలిక్‌ను ఆమిర్ మూడేళ్ల క్రితం వివాహం చేసుకోవడంతో అతనికి ఇంగ్లండ్‌లో సెటిల్ కావడానికి అవకాశం ఉంది. భార్య వీసా మీద ఆమీర్ ఇంగ్లండ్‌లో స్థిరపడే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.