Michael Vaughan: పెళ్లయిన సంగతి మర్చిపోతే కోహ్లీ పక్కా సెటైపోతాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్లో ఆర్సీబీ ఆందోళన అంతా కోహ్లీ బీభత్సమైన పేలవ ఫాంలో ఉండడమే. డక్, డక్, డక్ అంటూ కిక్కు కొట్టినా స్టార్ట్ కాని బండిలా కోహ్లీ పరిస్థితి ఉంది. దానికి తగ్గటే మూడు సార్లు డక్ అవుట్ అయ్యాడు. అవి మామూలు డక్‌లు కూడా కావు గోల్డెన్ డక్‌లు. తన కెరీర్లోనే దారుణాతి దారుణంగా ఆడుతున్న కోహ్లీకి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లు ఎక్కువైపోయారు. ఆట బంద్ చేసి హాయిగా పోయి రెస్ట్ తీసుకుపో అని కొందరు.. కోహ్లీని ఓపెనర్‌గా, వన్ డౌన్లో కాకుండా లోయర్ ఆర్డర్లో పంపించాండంటూ ఇంకొందరు.. కోహ్లీ నువ్వో పెద్ద తురుంఖానేం కాదు కాస్త నార్మల్ ప్లేయర్‌గా ఫీలయి ఆడితే సెట్ అయిపోతావని మరికొందరు సలహాలతో సతయిస్తున్నారు. దొరికిన కాడికి సలహాలు.. అందిన కాడికి సూచనలు అన్నట్లు కోహ్లీ మీద పడి ఒకటే నస పెడుతున్నారు. నాకు టైం బ్యాడ్ ఉందని కోహ్లీ చెబుతుంటే ఒక పక్కా.. పుండు మీద కారం జల్లినట్లు ఈ సజెషన్ పాటించు పక్కా రాణిస్తావు.. దీన్ని ఆచరించు పక్కా పనికొస్తావ్ అంటూ సజెషన్లతో సంపేసేలా ఉన్నారు.

ఆడినా ఆడకున్నా కోహ్లీకి మాత్రం ప్లేస్ గ్యారెంటీ

ఆడినా ఆడకున్నా కోహ్లీకి మాత్రం ప్లేస్ గ్యారెంటీ

ఈ సీజన్‌ కోహ్లీకి పీడకల లాంటిది. 12ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 111.3స్ట్రైక్ రేట్‌తో ఒక హాఫ్ సెంచరీ సహాయంతో కేవలం 216పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో మూడు సార్లు కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ కోహ్లీకి మాత్రం జాబ్ గ్యారెంటీ ప్రోగ్రాంలాగా.. ప్లేస్ గ్యారెంటీ ప్రోగ్రాం ఆర్సీబీలో నడుస్తుంది. పైగా ఆర్సీబీకి అతి విధేయుడుగా పేరున్న కోహ్లీని పక్కనపెట్టేంత ధైర్యం ఆర్సీబీ ఎలాగూ చేయదు. నమ్మకమనే లేని ఫీలింగ్‌తో ఆర్సీబీ జట్టు అతనికి ఓపెనర్‌గా అవకాశాలిస్తూనే ఉంది. ఇక శుక్రవారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీకి సజెషన్ ఎవరిస్తారా అని చూసే టైంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వచ్చేశాడు. వాన్ మామూలోడు కాదు తాను డైరెక్ట్‌గా కోహ్లీకి సజెషన్స్ ఇవ్వకుండా ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కోహ్లీకి చెప్పాల్సిన సజెషన్ అంటూ ఇన్ డైరెక్ట్ స్పీచ్‌లో వాన్ సలహాలు దంచేశాడు.

ఫస్ట్ 10 బాల్స్ ఆడమనండి చాలు

ఫస్ట్ 10 బాల్స్ ఆడమనండి చాలు

ఓ ప్రముఖ వెబ్‌సైట్‌తో మైఖేల్ వాన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు ఇలా తన సూచనలను గుప్పించాడు. ఓయ్ డుప్లెసిస్ కోహ్లీతో ఇలా చెప్పవోయ్ బాబు.. క్రికెట్‌లో కోహ్లీ మస్తు రికార్డులు సాధించాడు. కోహ్లీకి ఓ రేంజ్ ఉంది. కానీ అవన్నీ కోహ్లీ మర్చిపోవాలి. కుర్రాడు బాబోయ్ అన్నట్లు యువకుడిలా కోహ్లీ ఫీలవ్వాలి. బ్యాటింగ్ దిగినప్పుడు తొలి 10బంతులను కాస్త చూసి కాన్ఫిడెంట్‌గా ఆడమను. ఫస్ట్ 10బాల్స్ మంచిగా ఆడిండనుకో ఇక వేరే లెవల్లో కోహ్లీ ఆడతాడు.' అంటూ ఫాఫ్‌కు సాఫ్ సీదా సూచించాడు.

ఇంకా చాలా ఉంది బాబోయ్

ఇంకా చాలా ఉంది బాబోయ్

మైఖేల్ వాన్ తన స్పీచ్ అంతటితో ఆపేయలేదు. డుప్లెసిస్ కోహ్లీతో ఇలా చెప్పాలట. 'కోహ్లీ.. కోహ్లీ.. నీకు ఎలాంటి ప్రొఫైల్ లేని టైంలో సుమారు ఒక 10ఏళ్ల కిందట నువ్వు ఎలా ఆడేవాడివో గుర్తుతెచ్చుకో సరేనా. నీకింకా పెళ్లి కాలేదని ఫీలవ్వు. పెళ్లాంబిడ్డల గురించి మర్చిపో. కేవలం మ్యాచే నీకు కీలకం అని ఊహించుకో. బ్యాటింగ్‌కు దిగేముందు రఫ్ఫాడించాలని ఉత్సాహంతో బరిలోకి దిగు. నీ వయసు, నీ రికార్డులు తొక్కతోలు అన్నింటిని డగౌట్లోనే వదిలి క్రీజులోకి పో ఓకేనా' అంటూ డుప్లెసిస్ కోహ్లీకి క్లాస్ పీకితే విరాట్ సెటయిపోతాడట.

జస్ట్ పాస్ 35పరుగులు చేస్తే..

జస్ట్ పాస్ 35పరుగులు చేస్తే..

ఇక 100మార్కుల ఎగ్జామ్‌లో 35వస్తే పాస్ అయిపోతామనే విషయం తెలిసిందే. ఈ 35ను వాన్ మరోలా వాడుకున్నాడు. ఒకవేళ కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు 35రన్స్ గనుక చేసిండనుకో.. బీభత్సమైన ఇన్నింగ్స్ కోహ్లీ నుంచి వస్తుందని వాన్ అభిప్రాయం. కోహ్లీకి స్టార్టింగ్ ట్రబుల్ బాగా ఉందట. ఫస్ట్ ఓ 10రన్స్ చేయడానికి తెగ ఆయాసపడిపోతున్నాడట. తను ఈదుతున్న భవసాగరమంత ఆ 10 రన్స్‌లోపే ఉంటుందని వాన్ అంచనా. కాస్త ఈ స్టార్టింగ్ ట్రబుల్ తొలిగితే.. కోహ్లీ బండి తుఫాన్ వేగంతో దూసుకుపోతుందట. అతను ఎంత ప్రమాదకరంగా మారతాడంటే అడ్డొచ్చిన బౌలర్లను గుద్దిపడేసుడేనంటా.

కోహ్లీకి సెంచరీలకు సెంచరీలు అవసరం లేదు

కోహ్లీకి సెంచరీలకు సెంచరీలు అవసరం లేదు

వాన్ సంగతి పక్కన పెడితే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ కూడా కోహ్లీకి సజెషన్స్ ఇచ్చాడు. కానీ పాపం కోహ్లీ తరఫున మాట్లాడినట్టు పొలాక్ మాట్లాడిండు. ఆర్సీబీ జట్టు కోహ్లీ నుంచి భారీగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దన్నాడు. సెంచరీలకు సెంచరీలు అవసరం లేదని టీ20కు తగ్గట్టు కోహ్లీ ఓ 20బంతుల్లో 35పరుగులు చేస్తే చాలు అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లో తోపులు మస్తు మంది ఉన్నారట. కోహ్లీ క్విక్‌గా ఓ 35పరుగులు చేసి ఔటయినా మిగతా పని వాళ్లు చూసుకుంటారని పొలాక్ పేర్కొన్నాడు.

ముందు ఆర్సీబీ టీంకు చెప్పాలా.. ఇట్లా కాదని

ముందు ఆర్సీబీ టీంకు చెప్పాలా.. ఇట్లా కాదని

ఆర్సీబీ టీం మేనేజ్‌మెంట్ కోహ్లీతో ఎలా నడుచుకోవాలంటే.. కోహ్లీ వెళ్లి మ్యాచ్ మొత్తం అతనే ఆడాలి. లేకుంటే నడవదు అనేలా బిహేవ్ చేయొద్దు. ఆర్సీబీని కోహ్లీ గెలిపించాల్సిన అవసరం లేదు. కేవలం స్పీడ్‌గా 20బంతుల్లో 35పరుగులు చేస్తే సరిపోతది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి దిట్టమైన బ్యాటింగే ఉంది. లోయర్ ఆర్డర్లో చింపేసే హిట్టర్లున్నారు. ఇగ కోహ్లీ మీద కొంచెం ఒత్తిడి పడకుండా చూసుకోండి చాలు అని పొలాక్ పేర్కొన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 13, 2022, 15:36 [IST]
Other articles published on May 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X