
హైదరాబాద్: భారత జట్టుపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాగన్ నిప్పులు చెరుగుతున్నాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడటం వల్ల ఓడిపోయమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం ఆతిథ్య జట్టుతో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్ ఓటమికి కోహ్లిసేన స్లో ఓవర్ రేటే కారణమని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.
దీని కారణంగానే భారత బౌలర్లు చివర్లో చెలరేగి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారని తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే ఈ మాజీ కెప్టెన్‌కు భారత అభిమానులు కూడా దీటుగా బదులిస్తున్నారు. ప్రతి బంతి మైదానం బయట పడ్డదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఇంకా పలు రకాలు కామెంట్లు చేశారు.
'ఇరు జట్ల స్కోర్స్ 200 పరుగులు, 8 వికెట్లు దీన్నిబట్టే బంతి చాలసార్లు మైదానం బయటపడిందని, వికెట్ల కోల్పోవడంతో సమయం వృథా అయిందని చెప్పొచ్చు. ఇంగ్లీష్ బౌలర్లది ఎలా ఫాస్ట్ ఓవర్? స్లో ఓవర్ రేట్ ఎలా ప్రభావితం చేసింది?' మరొకరు పేర్కొన్నారు. ఓటమికి సాకులు వెతుకోక్కండని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. ఇక తొలి టీ20 అనంతరం ఇంగ్లాండ్ మాజీ క్రికెట్ డేవిడ్ విల్లే భారత బౌలర్లను తప్పుబట్టిన విషయం తెలసిందే. టీమిండియా బౌలర్లు కీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని విల్లే సంచలన కామెంట్స్ చేశారు. ఇలా ఓటమిని సర్ది చెప్పుకోవడానికి విల్లే చేసిన రెండో ప్రయత్నమిది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్ జేసన్ రాయ్ (67) 31 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ ఛేదించే ఉద్దేశ్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన.. రోహిత్ శర్మ (100) 56 బంతుల్లో 11ఫోర్లు, 5సిక్సులు అజేయ సెంచరీ బాదడంతో భారత్ 18.4 ఓవర్లలోనే 201/3తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది. భారత్‌కి ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ను గురువారం ఆడనుంది.