న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెల్‌డన్ దాదా: సోషల్ మీడియాలో సౌరవ్ గంగూలీపై ప్రశంసల వర్షం

 Michael Vaughan, Shane Warne want India to play Day-Night Test on Australia tour in 2020

హైదరాబాద్: భారత్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చి ఈడెన్ గార్డెన్స్ చరిత్ర సృష్టించింది. తొలిరోజు ఆటకు సుమారు ల‌క్ష మందికిపైగా ప్రేక్ష‌కుల‌ు హాజరయ్యారు. పింక్‌బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్‌ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్‌ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది.

అయితే, భారత్‌లో తొలి డే నైట్ టెస్టు విజయవంతం కావడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీదే కీలకపాత్ర. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీపై ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌, ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

ఓ సూపర్ క్యాచ్: పింక్ బాల్ టెస్ట్‌లో కోహ్లీ ఎలా ఔటయ్యాడో తెలుసా? (వీడియో)ఓ సూపర్ క్యాచ్: పింక్ బాల్ టెస్ట్‌లో కోహ్లీ ఎలా ఔటయ్యాడో తెలుసా? (వీడియో)

"డే నైట్ టెస్టు ఆడేందుకు అంగీకరించిన మీ ఇద్దరికీ (గంగూలీ, కోహ్లీ) అభినందనలు. వచ్చే సమ్మర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు అడిలైట్‌లో ఆసీస్‌తో డే/నైట్ టెస్టు ఆడుతుందని భావిస్తున్నా. అప్పుడు అద్భుతంగా ఉంటుంది" అని షేన్ వార్న్ ట్వీట్ చేశాడు.

మరోవైపు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం సౌరవ్ గంగూలీపై ప్రశంసల వర్షం కురిపించాడు. "వెల్‌డన్ సౌరవ్.. వచ్చే వింటర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే డే/నైట్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటా" అని ట్వీట్ చేశాడు. కాగా, భారత్‌లో తొలిసారి డే నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతుండటంతో బీసీసీఐ బాగా ప్రమోట్ చేసింది.

అయితే, టీమిండియా స్థాయికి తగ్గట్టు బంగ్లాదేశ్ పోటీఇవ్వలేకపోతుంది. అదే ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగే డే నైట్ టెస్టు మ్యాచ్ అయితే రసవత్తరంగా ఉంటుందని మాజీ క్రికెట్ దిగ్గజాలు అంచనా వేస్తున్నారు. గతేడాది అడిలైడ్‌లో పింక్ టెస్టు ఆడాలన్న ఆసీస్‌ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, November 23, 2019, 20:01 [IST]
Other articles published on Nov 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X