
ఇంగ్లండ్ ఆటగాళ్ళు అసూయపడ్డారు:
అప్పటి ఐపీఎల్ డీల్‌పై తాజాగా స్పందించిన మైకెల్ వాన్.. మిగిలిన ఆటగాళ్లు ఆ మొత్తానికి కాస్త అసూయ చెందారని అన్నాడు. ఫాక్స్ స్పోర్ట్స్.కామ్ ఇంటర్వ్యూలో వాన్ మాట్లాడుతూ... 'ఆటగాళ్లు ఇప్పుడు ఆ విషయాన్ని ఒప్పుకోరు. కానీ.. పీటర్సన్‌కు భారీ ధర దక్కినప్పుడు ఇంగ్లండ్ ప్లేయర్స్ అసూయ చెందారు. జట్టులో గుసగుసలు, పుకార్లు వినియించాయి. గ్రేమ్ స్వాన్, టిమ్ బ్రెస్నన్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ మరియు మాట్ ప్రియర్ లాంటి వారికి కొద్ది మొత్తంలో ఒప్పందాలు ఉండేవి' అని తెలిపాడు.

డబ్బు కోసమే ఐపీఎల్ ఆడుతున్నాడు:
'ఐపీఎల్‌లో ఆడటం వలన వన్డేల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. అయితే అతను డబ్బు కోసమే ఐపీఎల్ ఆడుతున్నట్లు ఇంగ్లండ్ ఆటగాళ్ళు భావించారు. వన్డే జట్టు యొక్క అభివృద్ధి మరింత పెంచుతుందని, వన్డే ఆటగాళ్లందరికీ అక్కడ ఆడడం వలన వారి ఆటను మెరుగుపర్చడానికి అవకాశం లభిస్తుందని పీటర్సన్ చెప్పినా కూడా ఎవరూ వినలేదు' అని మైకెల్ వాన్ చెప్పుకొచ్చాడు.

3 టెస్టులు, 10 వన్డేలకు నాయకత్వం:
2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2012లో అప్పటి కెప్టెన్ ఆండ్రు స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్‌ను విమర్శిస్తూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పీటర్సన్ సందేశాలు పంపాడన్న ఆరోపణలు అతడిపై వేటు వేసేందుకు మరో కారణం. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు నాయకత్వం వహించాడు.

104 టెస్టులు.. 136 వన్డేలు:
దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ సందర్భంగా పలువురు ఆటగాళ్లను కేపీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications
