'షకీబుల్‌పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు.. అతనికి రెండేళ్ల నిషేధం సరిపోదు'

Michael Vaughan said No sympathy whats so ever for Shakib Al Hasan, 2 yrs isnt enough

హైదరాబాద్: ఐసీసీ నిషేదానికి గురైన బంగ్లాదేశ్‌ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబుల్‌ హసన్‌పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు. అతనిపై విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదు, ఇంకా ఎక్కువ కాలం విధించాల్సింది అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డారు. షకీబుల్‌పై ఐసీసీ మంగళవారం వేటు వేసింది. ఏ ఫార్మాట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నమోదు చేసిన అభియోగాలను షకీబుల్‌ అంగీకరించాడు. దీంతో ఒక ఏడాది పూర్తిగా నిషేధం, మరో ఏడాది సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఐసీసీ వెల్లడించింది.

షకీబుల్‌ పొరపాటు చేశాడు.. అతనికి అండగా నిలవాలి: బంగ్లా ప్రధాని

రెండేళ్ల నిషేధం సరిపోదు:

రెండేళ్ల నిషేధం సరిపోదు:

ప్రపంచ ఆగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌ అయిన షకీబుల్‌ ఇలా నిషేదానికి బలవవడం ప్రపంచ క్రికెట్‌ను ఒక్కసారి షాక్‌కు గురిచేసింది. అయితే ఈ షకీబుల్‌ నిషేధంపై ప్రస్తుత, మాజీ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా మైకేల్‌ వాన్‌ కూడా తన ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'షకీబుల్‌పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు. అతడు తప్పు చేశాడు. ప్రతిఫలంగా శిక్ష అనుభవించాడు. ఈ ఘటన యువ క్రికెటర్లకు ఓ పాఠం. నిబంధనలు పాటించకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో అందరికి అర్ధం అయింది. షకీబుల్‌పై విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదు, ఇంకా ఎక్కువ కాలం విధించాల్సింది' అని రాసుకొచ్చారు.

నిషేధం ఓ గుణపాఠం:

నిషేధం ఓ గుణపాఠం:

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా కూడా షకీబుల్‌ నిషేధంపై మండిపడ్డాడు. షకీబుల్‌ నిషేధం మిగతా క్రికెటర్లకు ఒక గుణపాఠం అని అన్నారు. 'షకీబుల్‌ నిషేధం క్రీడా ప్రేమికులకు, క్రీడాకారులందరికీ ఒక గుణపాఠం. క్రీడా నియమాలు, ప్రోటోకాల్‌లను పక్కనబెట్టడం సరైన పెద్దది కాదు. క్రీడ కంటే ఏ ఆటగాడు పెద్దవాడు కాదు. అడ్డదారులలో వెళితే కెరీర్ పతనానికి సిద్ధంగా ఉండాలి' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మూడు అభియోగాలు:

మూడు అభియోగాలు:

2018 జనవరిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబుల్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం రెండు అభియోగాలు నమోదయ్యాయి. ఇక 2018 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా బుకీలు సంప్రదించారు. ఆ విషయాన్ని కూడా వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం జరిపిన విచారణలో షకీబుల్‌ తన తప్పులను ఒప్పుకున్నాడు. తన తప్పు అంగీకరించడంతో ఐసీసీ శిక్ష విధించింది.

చాలా బాధపడుతున్నా:

చాలా బాధపడుతున్నా:

'నిషేధానికి గురైనందుకు చాలా బాధపడుతున్నా. నా తప్పులను అంగీకరించా. ఐసీసీ అవినీతి నిరోధ విభాగం నిబంధనలను పాటించడంలో విఫలమయ్యా. అందరిలాగే నేను క్రికెట్‌ అవినీతి రహితంగా ఉండాలని కోరుకున్నా. నాలాగే యువకులు ఇలాంటి తప్పులు చేయకుండా ఐసీసీతో కలిసి పనిచేస్తా' అని షకీబుల్‌ పేర్కొన్నాడు.

 షకీబుల్‌కు అండగా బంగ్లా ప్రధాని:

షకీబుల్‌కు అండగా బంగ్లా ప్రధాని:

నిషేదానికి గురైన షకీబుల్‌కు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అండగా నిలిచారు. తాజాగా ప్రధాని ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'షకీబుల్‌ పొరపాటు చేశాడు. ఆ విషయాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఐసీసీ నిర్ణయంపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం, క్రికెట్‌ బోర్డు ఏమి చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. షకీబుల్‌ నిరాశ చెందకూడదు. ఇలాంటి సమయంలో షకీబుల్‌కు అండగా నిలవాలని బంగ్లా క్రికెట్‌ బోర్డుకు సూచిస్తున్నా' అని పేర్కొన్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, October 30, 2019, 11:34 [IST]
Other articles published on Oct 30, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more