India vs England 5th T20I: వేరే దారిలేదు.. రాహుల్ స్థానంలో ఇషాన్‌కు ఛాన్స్ ఇవ్వండి: వాన్

అహ్మదాబాద్: హోరాహోరీగా సాగిన భారత్, ఇంగ్లండ్ టీ20 సిరీస్ చివరి ఘట్టానికి చేరింది. రెండు విజయాలతో సమఉజ్జీలుగా కనిపిస్తున్న భారత్, ఇంగ్లండ్.. నేడు ఫైనల్ ఫైట్‌లో తలపడనున్నాయి. మొతేరా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. యువకులతో నిండిన కోహ్లీసేన జోరుమీదుంటే.. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ప్రపంచ నంబర్‌వన్ సత్తా ఏంటో చాటాలని చూస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్ ఎవరుగెలుస్తారనేది చెప్పడం కష్టమే.

జట్టు ఎంపికలో ఇబ్బందులు:
అయితే రిజర్వ్ బెంచ్ బలంగా ఉండడంతో ఫైనల్ పోరులో కోహ్లీసేనకు జట్టు ఎంపికలో ఇబ్బందులు తప్పేలా లేవు. సిరీస్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో 1,0, 0, 14 పరుగులతో నిరాశపరిచిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్ స్థానంలో యువ హిట్టర్ ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల మాట్లాడుతూ.. రాహుల్‌పై నమ్మకం ఉందని, టీ20ల్లో అతడే సరైన ఓపెనర్ అని అన్నాడు. మరి ఎవరిని తీసుకుంటాడో చూడాలి.

ఇషాన్‌కు ఛాన్స్ ఇవ్వండి:
కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో అతడికి బదులు ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. 'ఈ మ్యాచ్‌లో లోకేష్ రాహుల్ దాదాపు ఆడడు. ఇంతకుమించి వేరే దారిలేదు. అతడి స్థానంలో బాగా ఆడుతున్న ఇషాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. ఎలా ఆడాలనే స్పష్టత, ఆత్మవిశ్వాసం ఉన్న అతడే ఓపెనింగ్ చేస్తాడు. అయితే రాహుల్‌ను పూర్తిగా జట్టు నుంచి తప్పిస్తారని నేను అనుకోను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు ఆత్మవిశ్వాసంతో లేడు. ఫామ్ కోసం సతమతమౌతున్నాడు. అందువల్లే రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ ఓపెనింగ్ చేస్తాడు' అని వాన్ అన్నాడు.

హాఫ్ సెంచరీతో రాణించాడు:
రెండో టీ20లో వచ్చిన తొలి అవకాశాన్నే ఇషాన్ కిషన్ (56; 32 బంతుల్లో 5x4, 3x6) చక్కగా వినియోగించుకున్నాడు. హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో తనదైన ముద్ర వేశాడు. దీంతో ఈ యువబ్యాట్స్‌మన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూడో టీ20లో మాత్రం స్కోర్ చేయలేకపోయాడు. అనూహ్యంగా నాలుగో టీ20కి అతడిని కెప్టెన్ విరాట్ కోహ్లీ పక్కకు పెట్టాడు. అయితే రాహుల్ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఇషాన్‌కు మళ్లీ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది.

చెరో తొమ్మిది గెలిచాయి:
టీమిండియా గత ఏడు టీ20 సిరీస్‌ల్లో ఓటమి ఎరుగకుండా ముందుకు సాగుతున్నది. 2019 తర్వాత భారత్ ఆరు సిరీస్‌లు నెగ్గి ఒకదాన్ని 'డ్రా' చేసుకుంది. గత ఎనిమిది టీ20 సిరీస్‌ల్లో ఇంగ్లండ్‌కు పరాజయం ఎదురు కాలేదు. 2018 నుంచి ఏడు సిరీస్‌లు చేజిక్కించుకున్న మోర్గాన్ సేన ఒకదాన్ని 'డ్రా'గా ముగించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 18 మ్యాచ్‌ల్లో చెరో తొమ్మిది గెలిచాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications